మెగా హీరో రామ్ చరణ్, సమంత జంటగా రూపొందుతున్న తాజా చిత్రం రంగస్థలం 1985కి సంబంధించి మరో ఫోటోను షేర్ చేశారు హీరోయిన్ సమంత. సుకుమార్ దర్శకత్వంలో కోనసీమ అందాలతో షూటింగ్ కార్యక్రమాలు ఇ టీవల జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలోని పాత్రలకు సంబంధించిన విశేషాలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా మెగాహీరో రామ్ చరణ్ లుంగీ లుక్ వైరల్ కాగా, తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ట్రెడిషనల్ ఫోటో కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు షేర్ చేసిన చెరువు గట్టు మీద కూర్చొని తన పాదాలను చూపుతూ దిగిన ఫోటోకూడా అభిమానులను బాగానే ఆకట్టుకున్న సంగతితెలిసిందే.
పదహారణాల పల్లెటూరు అమ్మాయిలా చెరువు గట్టుపై కూర్చొని ఉన్న ఫోటోని సోమవారం తన అభిమానులతో పంచుకున్నారు. దీనికి జతగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో ఒకటి అభిమానుల మనసు దోచుకుంటోంది. కెమెరా అద్భుతమైన చిత్రాలను క్యాప్చర్ చేసేటపుడు చివరికి వేడి, అలసట నొప్పి ఇలాంటివి పెద్ద విషయాలు కాదంటూ సూర్తాస్తమయాన గట్టు ఒడ్డున కూర్చున్న ఓ బ్యూటిఫుల్ ఫోటోను ఆమె పోస్ట్ చేశారు. కెమెరా ఎక్స్‌ట్రా ఆర్డినరీ దృశ్యాలనే క్యాప్చర్ చేస్తుందంటూ కొన్ని ఫోటోలను ఉంచారు. దీంతో లైక్‌ల వెల్లువ కురుస్తోంది.