భారత యువజనం రోజుకు సగటున 2.2 గంటల పాటు మొబైల్‌ఫోన్ల ద్వారా ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్నారని అంతర్జాతీయ
న్యూఢిల్లీ: భారత యువజనం రోజుకు సగటున 2.2 గంటల పాటు మొబైల్‌ఫోన్ల ద్వారా ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్నారని అంతర్జాతీయ రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ టీఎన్‌ఎస్ సర్వే నివేదిక ఒకటి వెల్లడించింది. భారత్‌లో 16-30 ఏళ్ల వయస్కులు సగటున రోజుకు 2 గంటల 20 నిమిషాల పాటు(ఏడాదికి 34 రోజులు) మొబైల్ ఫోన్లపై ఇంటర్నెట్ కోసం వెచ్చిస్తున్నారని ఈ సంస్థ వెల్లడించింది. అయితే ఇది అంతర్జాతీయ సగటు (రోజుకు 3.2 గంటలు/ ఏడాదికి 49 రోజులు) కంటే తక్కువగానే ఉందని వివరించింది. భారత్‌లో 31-45 ఏళ్ల వయస్కులు రోజుకు సగటున 1.8 గంటల పాటు, 46-65 ఏళ్ల వయస్కులు రోజుకు సగటున 1.5 గంటల పాటు మొబైల్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది.