కోల్‌కతా : ఫొని తుపాన్ పలు రాష్ట్రాలపై పెను ప్రభావం చూపుతోంది. ఒడిషా తీరాన్ని తాకిన ఫొని తుపాన్ ప్రచండ వేగంతో కదులుతుండగా కొల్‌కతా విమానాశ్రయాన్ని శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం ఉదయం వరకూ మూసివేయాలని పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదేశించింది. కోల్‌కతా విమానాశ్రయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ విమానాల రాకపోకలు నిలిపివేసినట్టు డీజీసీఏ పేర్కొంది.
ఫొని తుపాన్ పురోగతిని పరిశీలించి కోల్‌కతా విమానాశ్రయంలో విమాన రాకపోకల నిలిపివేత సమయాన్ని సవరించామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు విమానాల రద్దుపై ఎలాంటి సమాచారం రాకపోవడంతో కోల్‌కతా విమానాశ్రయంలో పెద్దసంఖ్యలో ప్రయాణీకులు నిలిచిపోవడంతో గందరగోళం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment