సాధారణంగా విమానంలో ఏ ప్రయాణికుడి వద్దనైన విమానాశ్రయానికి తీసుకురాని వస్తువులు దొరికితే అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరుగుతుంది. అంతేగానీ ఎయిర్ పోర్ట్‌ని క్లోజ్ చేయరు. కానీ ఇక్కడొక ప్రయాణకుడి లగేజ్ బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు కారణంగా....మొత్తం ఎయిర్‌పోర్ట్‌నే క్లోజ్ చేశారు.
వివరాల్లోకెళ్తే...స్కాట్లాండ్‌లోని విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద ప్యాకేజీ కనిపించింది. దీంతో వందలాదిమంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ డెస్క్ వద్ద క్యూలో నిలబడి ఉన్నారు. దీంతో విమానాల్లో వెళ్లాల్సిన మరికొంతమంది ప్రయాణికులు కార్ పార్కింగ్‌లోనే నిలబడిపోయి ఉండాల్సి వచ్చింది. విమానాశ్రయంలో సిబ్బంది లగేజీలపై దర్యాప్తు చేస్తున్నందున ఆలస్యమవుతుందని ఎయిర్‌పోర్ట్ అధికారి తెలిపారు. ఐతే ప్రయాణికుడి లగేజీలో అనుమానాస్పద వస్తువు కారణంగానే.. సిబ్బంది అప్రమత్తమైనట్లు తెలిపారు.
దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడంతో మరింతమంది ప్రయాణికులు క్యూలో పడిగాపులు పడాల్సి వచ్చింది. మరోవైపు విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణకుల రద్దీ ఎక్కువ అవ్వడంతో తనిఖీలు చేయడం మరింత ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. అందువల్లే తాము ముందు జాగ్రత్తగా టెర్మినల్ భవనాన్ని మూసివేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అంతేగానీ ఎయిర్‌పోర్ట్‌ని మొత్తం ఖాళీ చేయించలేదని చెప్పారు.
(చదవండి: కరోనా విషయమై అగ్రరాజ్యం గుట్టు బట్టబయలు..వెలుగులోకి షాకింగ్ నిజాలు)
Comments
Please login to add a commentAdd a comment