చికెన్‌లో గన్‌.. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు షాక్‌! | Passenger Caught Trying Gun Found Stuffed In Raw Chicken | Sakshi
Sakshi News home page

చికెన్‌లో గన్‌.. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు షాక్‌!

Published Thu, Nov 10 2022 9:48 AM | Last Updated on Thu, Nov 10 2022 11:59 AM

Passenger Caught Trying Gun Found Stuffed In Raw Chicken - Sakshi

ఇంతవరకు కొంతమంది నేరస్తులు రకరకాల మార్గాల్లో ఆయుధాలను, బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు కంటపడకుండా తరలిస్తుంటారని తెలుసు. కొంతమంది విగ్గుల్లోనూ, షూ, పెన్‌ వంటి విచిత్రమైన ప్రదేశాల్లో చాలా గమ్మత్తుగా బంగారాన్ని తరలించడం చూశాం. అలాగే ఆయుధాలను కూడా చాలా వెరైటీగా తరలిస్తుంటారు. ఐతే ఇక్కడొక వ్యక్తి వారందరికంటే భిన్నంగా ఆయుధాన్ని తరలించే యత్నం చేసి పట్టుబడ్డాడు. 

వివరాల్లోకెళ్తే...యూఎస్‌లోని ఒక వ్యక్తి చికెన్‌లో గన్‌ని స్టఫ్‌ చేసి చక్కగా ప్యాకింగ్‌ చేసుకుని ఫ్లోరిడాలో లాడర్‌డేల్‌ హాలీవుడ్‌ విమానాశ్రయానికి వచ్చాడు. అక్కడ అందరీ ప్రయాణికులను తనిఖీ చేసినట్లుగానే ఇతన్ని తనిఖీ చేశారు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు. అతని వద్ద ఉన్న ప్యాకింగ్‌ చికెన్‌ని చూసి కాస్త ఆశ్చర్యంతోపాటు సందేహం కూడా వచ్చింది అధికారులకు.

దీంతో ఆ ప్యాకింగ్‌ కవర్‌ని ఓపెన్‌ చూసి పరిశీలించగా...ఆ చికెన్‌ లోపల గన్‌ని కుక్కి ఉంచాడాన్ని చూసి ఒక్కసారిగా అధికారులు షాక్‌కి గురయ్యారు. ఇంతవరకు తాము వివిధ రకాల్లో ఆయుధాలను తరలించడం చూశాం గానీ ఇలా ఇంత వింతగా తరలించేందుకు యత్నించడం చూసి ఆశ్చర్యపోయాం అన్నారు. దీంతో సదరు వ్యక్తి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు.

వాస్తవానికి యూఎస్‌ ఎయిర్‌లైన్స్‌లో తుపాకీలను నిషేధించ లేదు. కానీ ప్రయాణికులు వాటిని తీసుకుని వెళ్లేటప్పుడూ..తనిఖీ చేసే సామానుల్లోనే తీసుకువెళ్లాలి. పైగా ఆ తుపాకీలను అన్‌లోడ్‌ చేసి హార్డ్‌ కంటైనర్‌లో లాక్‌ చేసి పట్టుకెళ్లాలి. ఇలా అక్రమ మార్గంలో తరలించేందుకు యత్నిస్తే మాత్రం పోలీసులు కచ్చితంగా సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు.

(చదవండి: ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement