చైన్నై ఎయిర్ పోర్ట్‌లో ఒకటి రెండుకాదు ఏకంగా 22 పామలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో చెన్నై ఎయిర్‌పోర్ట్ వార్తల్లో నిలించింది. ఓ మహిళా ప్రయాణికురాలి లగేజ్ బ్యాగ్‌ని తనిఖీలో భాగంగా సోదా చేస్తుండగా.. ఓ పారద్శక ప్లాస్టిక్ కంటైనర్‌లో సర్పాలు ఉండటాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ పాములను రాడ్‌తో తీస్తుండగా.. మరికొన్ని పాములు పెట్టెల్లోంచి బయట నేలపైకి వచ్చేయడం జరిగింది.
ఆ లగేజ్ బ్యాగ్‌లో ఊసరవెల్లిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సదరు మహిళ ఏప్రిల్ 28న కౌలాంలంపూర్ నుంచి ఏకే13 విమానంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి వచ్చింది. అక్కడ కస్టమ్స్ అధికారులు ఆమెను అడ్డుకుని తనిఖీలు నిర్వహించగా ఈ విషయం వెలుగు చూసింది. కస్టమ్స్ అధికారులు ఆమెపై వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ట్వీట్ చేశారు.
Woman who smuggles snakes 🐍
— Atulkrishan (@iAtulKrishan) April 29, 2023
A woman was held at Chennai Airport with 22 snakes
She arrived from Kuala Lumpur by Flight No. AK13
On examination of her checked-in baggage, 22 Snakes of various species and a Chameleon were found & seized pic.twitter.com/TI39llr72O
Comments
Please login to add a commentAdd a comment