
వాషింగ్టన్: టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ శనివారం సంచలన ప్రకటన చేశారు. టెస్లా కార్లతో గూఢచర్యానికి పాల్పడినట్లు రుజువైతే కంపెనీని మూసివేస్తానని ఎలాన్ మస్క్ తెలిపారు. టెస్లాకార్లు గూఢచర్యం కోసం ఉపయోగిస్తున్నారనే అనుమానాన్ని చైనా మిలటరీ భావించింది. దీంతో మస్క్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. చైనా ప్రభుత్వం వారి దేశంలో మిలటరీ వాడుతున్న టెస్లా కార్లను పూర్తిగా నిషేధించింది. మస్క్ ‘ఒకవేళ టెస్లా కార్లు చైనాలో కాని, వేరే దేశాల్లో కాని గూఢచర్చానికి పాల్పడినట్లతే టెస్లా కంపెనీ ను మూసివేస్తానని చైనాకు చెందిన ప్రముఖ సంస్థతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో తెలిపారు.
ప్రముఖ మీడియా సంస్థల కథనం ప్రకారం... చైనా రక్షణ దళం భద్రత కారణాలరీత్యా, సైనిక సమూదాయాల్లోకి టెస్లా కార్లను రాకుండా నిషేధించిందని తెలిపింది.టెస్లా కార్లకున్న కెమెరాలతో తమ దేశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుందని చైనా రక్షణ దళం భావించిందని పేర్కొన్నారు. అలాస్కాలో చైనా, యూఎస్ దౌత్యవేత్తల మధ్య జరిగిన సమావేశం తరువాత ఈ నిషేధాజ్ఞలు వెలువడ్డాయి. జనవరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇరు దేశాల మధ్య జరిగిన తొలి భేటి. గత ఏడాది చైనాలో టెస్లా 1,47,445 కార్లను కంపెనీ అమ్మగా ప్రస్తుతం ఈ ఏడాది చైనా కంపెనీ నియో నుంచి టెస్లా గట్టి పోటినీ ఎదుర్కొంటుంది.