సాక్షి, సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ బంద్ మూడో రోజు కొనసాగుతోంది. పవర్ లూమ్ సాంచాలు మూగబోయాయి. పాలిస్టర్ పరిశ్రమ బంద్‌తో సుమారు 20 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పాలిస్టర్‌కు మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడం దేశవ్యాప్తంగా సంక్షోభం నెలకొంది. ఇప్పటికే సిరిసిల్ల మిల్లుల్లో
రూ. 35 కోట్ల రూపాయల పాలిస్టర్ బట్ట పేరుకు పోయింది. కార్ఖానాల్లోనే ఉత్పత్తి చేసిన బట్ట నిల్వలు ఉండటంతో కొత్త బట్ట ఉత్పత్తి చేయొద్దని సిరిసిల్ల మ్యానుప్యాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్స్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
చేనేత, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమస్యపై దృష్టి సారించారు. ఆర్వీఎం బట్టల ఉత్పత్తి ఆర్డర్లను మ్యాక్స్, ఎస్ఎస్ఐ యూనిట్లకు అప్పగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment