Sircilla Textile industry
-
సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. మూడోరోజూ కొనసాగుతున్న బంద్
సాక్షి, సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ బంద్ మూడో రోజు కొనసాగుతోంది. పవర్ లూమ్ సాంచాలు మూగబోయాయి. పాలిస్టర్ పరిశ్రమ బంద్‌తో సుమారు 20 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పాలిస్టర్‌కు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం దేశవ్యాప్తంగా సంక్షోభం నెలకొంది. ఇప్పటికే సిరిసిల్ల మిల్లుల్లో రూ. 35 కోట్ల రూపాయల పాలిస్టర్ బట్ట పేరుకు పోయింది. కార్ఖానాల్లోనే ఉత్పత్తి చేసిన బట్ట నిల్వలు ఉండటంతో కొత్త బట్ట ఉత్పత్తి చేయొద్దని సిరిసిల్ల మ్యానుప్యాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్స్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేత, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమస్యపై దృష్టి సారించారు. ఆర్వీఎం బట్టల ఉత్పత్తి ఆర్డర్లను మ్యాక్స్, ఎస్ఎస్ఐ యూనిట్లకు అప్పగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఆ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాల్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నేతన్నలు, అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారు. గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలి. గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ సహకారం ఉంటే తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే అవకాశాలు ఈ రంగానికి ఉన్నాయి. అయితే ఈ రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: కవిత రానంది.. ఈడీ యాక్షన్ ఎలా ఉండనుందో? -
సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ నిరవధికంగా మూసివేత
-
సిరిసిల్ల నేతన్నలు అదుర్స్: అమెరికా రీసెర్చ్ స్కాలర్ కైరా ప్రశంసలు
సాక్షి, సిరిసిల్ల: అగ్గిపెట్టలో పట్టే చీర నేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన అక్కడి నేతన్నలపై ప్రశంసలు కురిపించారు అమెరికా చేనేత నైపుణ్య నిపుణురాలు, రీసెర్చ్ స్కాలర్ కైరా జాఫ్. నేతన్నల కళానైపుణ్యాలను చూసి అబ్బురపడిపోయారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాండ్తో ఆసియాలోని వివిధ దేశాల్లో చేనేత పరిస్థితులు, నేతన్నల నైపుణ్యం వంటి రంగాలపై సమగ్రమైన అధ్యయనం చేస్తున్న కైరా.. శనివారం సిరిసిల్లలో పర్యటించారు. సిద్దిపేటలోని సెరికల్చర్ రైతులతో క్షేత్రస్థాయి పర్యటన ముగించుకొని అక్కడి నుంచి సిరిసిల్ల చేరుకున్న ఆమె నేతన్నలతో సమావేశమయ్యారు. చేనేత కార్మికుల మగ్గాలు, వారు నేస్తున్న బట్టలు, చేనేత నైపుణ్యాలకు సంబంధించిన అంశాలపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేనేత కళ నుంచి మరమగ్గాలవైపు సిరిసిల్ల నేతన్నలు మళ్ళిన చారిత్రాత్మక క్రమంపైనా ఆమె వివరాలు తీసుకున్నారు. తన వినూత్నమైన చేనేత ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన హరిప్రసాద్‌ను కలిశారు కైరా జాఫ్. ఆయన రూపొందించిన వివిధ చేనేత ఉత్పత్తులు, ముఖ్యంగా అగ్గిపెట్టెలో పట్టేలా నేసిన చీరను చూసి ఆమె అబ్బురపడ్డారు. ఇంత అద్భుతమైన ప్రతిభ నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను ఇంతవరకు తాను చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణంలో ఉన్న చేనేత కార్మికుల నైపుణ్యంతో పాటు పవర్ లూమ్ క్లస్టర్‌గా మారిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్షోభం నుంచి స్వయం సమృద్ధి వైపు సాగుతుండడంపైన ఆమె ఆసక్తి చూపారు. కైరా బృందం వెంట తెలంగాణ మర మగ్గాలు, జౌళి అభివృద్థి కార్పొరేషన్ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, స్థానిక టెక్స్టైల్ అధికారులతో పాటు చేనేత నేత కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా ఒకప్పుడు సిరిసిల్ల క్లస్టర్లో నేతన్నల ఇబ్బందులు, పరిశ్రమ సంక్షోభం, దాని నుంచి బయటపడిన విధానం, అందుకు ప్రభుత్వం అందించిన సహకారం, కార్మికులు తమ నైపుణ్యాలను, పవర్లూమ్ యంత్రాలను ఆధునికరించిన విధానం వంటి వివరాలను అందజేశారు. చేనేత కార్మిక క్షేత్రాల్లో పర్యటన.. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న పరిస్థితులు, అక్కడి చేనేత పరిశ్రమపైన ఆమె తన అధ్యయనాన్ని పూర్తిచేసుకుని భారత్‌కు వచ్చారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తన అధ్యయనాన్ని కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మిక క్షేత్రాలైన పోచంపల్లి, గద్వాల్ సహా ఇతర నేత కార్మిక క్షేత్రాలు ఎన్ఎస్ సిరిసిల్ల సిద్దిపేట జనగామ వంటి ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఇదీ చదవండి: బయోమెట్రిక్ పద్ధతిన పింఛన్లు స్వాహా!..లబోదిబోమంటున్న బాధితులు -
నేతన్నల పోరుబాట..
- సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ‘సమ్మె’ట - నేటి నుంచి పవర్‌లూం కార్మికుల సమ్మె సాక్షి, సిరిసిల్ల: కూలీ గిట్టుబాటు కోసం నేతన్నలు పోరుబాట పట్టారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, కార్మికులకు నెలకు రూ.15 వేల కూలీ వచ్చేట్లు చూడాలని చెప్పినా యజమానులు పెడచెవిన పెట్టడంతో కార్మికులు రోడ్డెక్కారు. కార్మికశాఖ అధికారుల సమక్షంలో యజమానులతో కార్మికులు జరిపిన చర్చలు విఫలం కావడంతో 8వ తేదీ నుంచి సమ్మెకు వెళుతున్నట్లు నేత కార్మిక సంఘ నాయకులు ఇప్పటికే ప్రకటించారు. బలవన్మరణాలకు పాల్పడుతున్న నేత కార్మికుల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన ఉపాధి ఆర్డర్లు పెద్దల ఖాతాల్లోకి వెళుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ఆదేశాన్ని అమలు చేయాలి కార్మికులకు నెలకు కనీసం రూ.15 వేల వేతనం వచ్చేట్లు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందో ళన బాట పట్టారు. అలాగే కార్మికుల ఆత్మహత్యల నివారణకు, శాశ్వత ఉపాధి కల్పనకు ప్రతి కార్మికుడికి నాలుగు సాంచాలు, వర్క్‌షెడ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. స్తంభించనున్న 35 వేల మరమగ్గాలు రాష్ట్రవ్యాప్తంగా మరమగ్గాలు (పవర్‌లూం) సిరిసిల్లలోనే అధికం. ఇక్కడ 45 వేల మరమగ్గాలున్నాయి. ఇందులో 35 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. మరమగ్గాలకు అనుబంధంగా వార్ఫిన్, ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తుంటాయి. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఏటా సుమారు రూ.350 కోట్ల విలువైన వస్త్రాన్ని పవర్‌లూంలపై తయారు చేస్తుంటారు. సోమవారం నుంచి పవర్‌లూం కార్మికులు సమ్మెలోకి వెళుతుండడంతో 35 వేల మరమగ్గాలు స్తంభించనున్నాయి. -
సిరిసిల్ల వస్త్రానికి ఎన్ని‘కళ’
సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఎన్నికల గాలితాకింది. వరుసగా ఎన్నికలు రావడంతో సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి కళ వచ్చింది. ఇక్కడి వస్త్రోత్పత్తిదారులకు చేతినిండా పని లభిస్తోంది. రాజకీయపార్టీలు వినియోగించే బ్యానర్లు, జెండాలు, కండువాలు తయారీకి అవసరమైన గుడ్డ సిరిసిల్లలోనే ఉత్పత్తికావడంతో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న గుడ్డ మన రాష్ట్రంతో పాటు జార్ఖండ్, ఉత్తరాంచల్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలకు ఎగుమతి అవుతోంది. న్యూస్‌లైన్, సిరిసిల్ల,రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో 27వేల మరమగ్గాలపై పాలిస్టర్, 7వేల మగ్గాలపై కాటన్ గుడ్డ ఉత్పత్తి అవుతోంది. పాతికవేల కుటుంబాలు వస్త్రోత్పత్తి పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. నూలు ధరలు పెరగడం, ఉత్పత్తి చేసిన గుడ్డకు గిరాకీ లేక వస్త్ర వ్యాపారులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. కరెంటు బిల్లులు పెరిగి విడిభాగాల రేట్లు ఎక్కువై వస్త్రోత్పత్తి గిట్టుబాటు లేని పరిస్థితి గతంలో ఎదురైంది. ఇప్పుడు గుడ్డకు కాస్త ధర పెరగడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకేసారి స్థానిక, మున్సిపల్, సార్వత్రిక న్నికలు రావడంతో వస్త్రవ్యాపారులకు కలిసొచ్చింది. సిరిసిల్లలో నిత్యం 27లక్షల మీటర్ల గుడ్డ ఉత్పత్తవుతుండగా, గతంలో వస్త్ర నిల్వలు అమ్మకాల్లేక పేరుకుపోయాయి. ఎన్నికల పుణ్యమా.. అని ఇప్పుడు వస్త్ర నిల్వలన్నీ హైదరాబాద్‌లోని మార్వాడి సేట్లు కొనుగోలు చేయడంతో గుడ్డనిల్వలు లేకుండా పోయాయి. ఎన్నికల పుణ్యమా అని.. ఎన్నికలకు అవసరమైన జెండాలు, బ్యానర్లు, కండువాలు, క్యాప్‌లకు చౌకగా లభించే గుడ్డ అవసరమవుతోంది. సిరిసిల్లలో నాసిరకం గుడ్డ ఉత్పత్తవుతుండగా, జాతీయ మార్కెట్లో సిరిసిల్ల గుడ్డను ఎన్నడూలేని విధంగా ఎన్నికల సమయంలో ఎక్కువగా కొనుగోలు చేయడం పరిపాటి. దీంతో సిరిసిల్ల వస్త్రానికి గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో మరమగ్గాల కార్మికులకు చేతినిండా పని లభిస్తోంది. పాలిస్టర్ వస్త్రానికి డిమాండ్ ఉండడంతో కార్మికులతో యజమానులు, ఆసాములు పని చేయిస్తున్నారు. సిరిసిల్లలో 8గంటల పని విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్దేశించగా, గుడ్డకు డిమాండ్ ఉండడంతో 12 గంటలు పని చేయిస్తున్నారు. మరో మూడు నెలల వరకు కార్మికులకు పని ఉంటుందని భావిస్తున్నారు. సిరిసిల్లలో తక్కువ ధరకు గుడ్డ దొరుకుతుండగా, ఆ గుడ్డను రంగుల్లో ప్రింట్ చేసేందుకు ప్రాసెసింగ్ చేయడానికి మీటర్ రూ.10 వరకు ఖర్చవుతోంది. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో మిల్లుల్లో ప్రాసెసింగ్ చేయడానికి ఎక్కువ ఖర్చవుతోంది. మొత్తంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఊరట లభించింది.