ట్విట్టర్ నుంచి ఆ ఫీచర్ అవుట్! | Twitter to Shut Down Dashboard Feature For Businesses | Sakshi
Sakshi News home page

ట్విట్టర్ నుంచి ఆ ఫీచర్ అవుట్!

Published Thu, Jan 12 2017 1:55 PM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM

Twitter to Shut Down Dashboard Feature For Businesses

కొత్త కొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకోవాల్సింది పోయి, ఉన్న ఫీచర్లను తొలగిస్తోంది ట్విట్టర్. బిజినెస్లకు ఎక్కువగా ఉపయోగపడే డ్యాష్ బోర్డ్ ఫీచర్ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.  2016 జూన్లో లాంచ్ చేసిన ఈ ఫీచర్ను 2017 ఫిబ్రవరి 3 నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్టు పేర్కొంది. ట్వీట్లను ట్రాక్ చేయడం, అనాలిటిక్స్ను పొందడం వంటి పలు వాటిని ఈ ఫీచర్ ఆఫర్ చేస్తోంది. అయితే తొలగిస్తున్న ఈ ఫీచర్ అనంతర ప్లాన్స్ ఏమిటన్నది ట్విట్టర్ తెలుపలేదు. బిజినెస్ల కోసం ఇదేమాదిరి ఫీచర్లను ఎలా వాడుకోవాలనే దానిపై క్లారిటీ లేదు.
 
భవిష్యత్తులో డ్యాష్ బోర్డు నుంచి ట్విట్టర్ కమ్యూనిటీ బోర్డర్లో మంచి ఫీచర్లను తీసుకొస్తామని తాము ఆశిస్తున్నట్టు ట్విట్టర్ డ్యాష్ బోర్డు పలు ట్వీట్లను చేసింది. ఎక్కువమంది దీన్ని ఇన్స్టాల్ చేసుకోకపోవడంతో ఈ ప్రొడక్ట్ను తొలగిస్తున్నట్టు తెలిపింది. బిజినెస్ యాప్స్ కేటగిరిలో ట్విట్టర్ డ్యాష్ బోర్డుకు చాలా తక్కువగా 432 ర్యాంకు నమోదైంది. లాంచ్ అయినప్పటి నుంచి ఈ యాప్ను 40వేల సార్లే డౌన్ లోడ్ చేశారు. 2016 అక్టోబర్లో వైన్ను కూడా ట్విట్టర్ క్లోజ్ చేసింది. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement