
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం' కెనడా యూజర్లకు భారీ షాకిచ్చింది. కెనడాలో పేటీఎం సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
తొలిసారి పేటీఎం 2014లో కెనడాలో సేవలందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అనంతరం 2017లో పేటీఎం మొబైల్ యాప్‌ను లాంఛ్ చేసింది. ఈఫీచర్ సాయంతో బిల్స్, ఇతర ట్రాన్సాక్షన్‌ల కోసం సౌకర్యంగా ఉండేందుకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పుడు పేటీఎం కెనడాలో సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ మార్కెట్‌లో పేటీఎం కార్యకలాపాలపై దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. కాగా, కెనడాలో పేటీఎం యాప్ సేవలు నిలిపివేసినా.. ఇండియన్ యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని వెల్లడించారు.
దురదృష్టవశాత్తూ..
సేవల్ని నిలిపివేయడంపై పేటీఎం తన బ్లాగ్ పోస్ట్‌లో ఇలా పేర్కొంది. కొన్ని సార్లు కఠినమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తు ఈ ఏడాది మార్చి14 నాటికి పూర్తిగా సేవల్ని నిలిపివేస్తాం. నేటి నుంచి (జనవరి14) ఈ పేటీఎం కార్యకలాపాలు దశలవారీగా అమల్లోకి వస్తాయని తెలిపింది.
చదవండి: మాకు బజాజ్ ఫైనాన్స్ ఒక్కటే బెంచ్‌మార్క్: పేటీఎం సీఈవో విజయ్‌శేఖర్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment