సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయం తిరోగమన చర్యేనని, గత ఆరేళ్లలో విద్యారంగాన్ని సర్కార్ నిర్లక్ష్యం చేసిందని రౌండ్ టేబుల్ సమావేశం ఆరోపించింది. బీజేపీ రిటైర్డ్ టీచర్స్, ఎంప్లాయీస్ సెల్ చైర్మన్ బి.మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 12 వేల పాఠశాలల మూసివేతకు చేసిన సిఫార్సులను రద్దు చేయాలని భేటీలో పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ నిలిపేయాలని, బడ్జెట్‌లో విద్యకు 15 శాతం నిధులు విడుదల చేయాలని వారు కోరారు. ఐదున్నర ఏళ్లలో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 8 వేల పోస్టులనే భర్తీ చేశారన్నారు. 20 దేశాలు వ్యతిరేకించిన సీసీఐ విధానాన్ని మన రాష్ట్రం కూడా నిలిపేయాలని పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment