ప్రముఖ అమెరికన్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ చైనాకు గట్టి షాక్‌ను ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్‌ఇన్ కెరీర్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాంను మూసివేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా తెచ్చిన చట్టాలను కట్టుబడి ఉండటం సవాలుగా మారడంతో లింక్డ్ ఇన్ సేవలను మూసివేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది. చైనా జర్నలిస్టుల ప్రోఫైళ్లను మైక్రోసాఫ్ట్ బ్లాక్‌చేసింది. దీంతో మైక్రోసాఫ్ట్‌ను అక్కడి ప్రభుత్వం ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
చదవండి: 4 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు...! ఎలాగంటే...
లింక్డ్ ఇన్ ప్లేస్‌లో...!
లింక్డ్ ఇన్ సేవలను నిలిపివేసినప్పటికీ చైనా మార్కెట్లను వదిలివెళ్లడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధంగా లేనట్లు కన్పిస్తోంది. లింక్డ్ ఇన్ స్థానంలో ఇన్‌జాబ్స్‌ను త్వరలోనే మైక్రోసాఫ్ట్ లాంచ్ చేయనుంది. లింక్డ్ ఇన్‌లో మాదిరిగా ఇన్‌జాబ్స్‌లో యూజర్లు తమ అభిప్రాయాలను పంచుకొలేరు. లింక్డ్ ఇన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మొహక్ ష్రాఫ్ మాట్లాడుతూ.... అమెరికన్ కంపెనీలపై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా పలు కంపెనీలను తమ అధీనంలో ఉంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని వెల్లడించారు.
కంపెనీలపై డ్రాగన్ వీపరితబుద్ది..!
గత కొద్ది రోజుల నుంచి దిగ్గజ కంపెనీలపై చైనా విరుచుకుపడుతుంది. ఆయా అమెరికన్ కంపెనీలను కట్టడి చేసేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలను చేస్తోంది. చైనా నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠిన ఆంక్షలను పెడుతుంది. అమెరికన్ కంపెనీలపైనే కాకుండా స్వదేశీ కంపెనీలపై కూడా వీపరితంగా ప్రవర్తిస్తోంది.
చదవండి: లీకుల పేరుతో ఉద్యోగులపై ఆపిల్ వేటు
Comments
Please login to add a commentAdd a comment