మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య ప్రపంచంలోనే చాలా దేశాలను అతలాకుతలం చేశాయి. ఇందులో భారత్ సహా అమెరికా, యూరప్ దేశాలు ఉన్నాయి. అనేక దేశాలపై పడిన ఈ మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ చైనాలో మాత్రం అంతంతమాత్రంగానే ఉండటం గమనించదగ్గ విషయం.
ప్రపంచవ్యాప్తంగా విమానాలు, ఐటీ వ్యవస్థలు, వ్యాపారాలపై ప్రభావం చూపిన మైక్రోసాఫ్ట్ అంతరాయం చైనాపై పెద్దగా ప్రభావం చూపలేదు. చైనాలోని కీలకమైన మౌలిక సదుపాయాలు, విమానయాన సంస్థలు, బ్యాంకుల కార్యకలాపాలు కూడా సజావుగా జరిగాయి. ఈ విషయాన్ని బీజింగ్‌కు చెందిన పలువురు సోషల్ మీడియా వినియోగదారులు, స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.
ప్రపంచంలోని చాలా దేశాలు మైక్రోసాఫ్ట్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే చైనా మాత్రం విదేశీ టెక్నాలజీల మీద ఆధారపడటాన్ని తగ్గించి, సొంత దేశ టెక్నాలజీలనే ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ కారణంగానే చైనాలో మైక్రోసాఫ్ట్ వినియోగం లేదు. కాబట్టి మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ చైనా మీద పెద్దగా ప్రభావం చూపలేదు. కాబట్టి చైనాలో రోజూ జరగవలసిన కార్యకలాపాలు నిర్విరామంగా జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment