Huge Solar Storm Hits Earth: 5 Most Dangerous Things Can Happen - Sakshi
Sakshi News home page

Solar Storm: ముంచుకొస్తున్న సౌర తుఫాన్‌..! అదే జరిగితే అంధకారమే...!

Published Tue, Oct 12 2021 6:38 PM | Last Updated on Wed, Oct 13 2021 1:13 PM

Solar Storm Hits Earth These 4 Dangerous Things Can Happen - Sakshi

గతంలో 16 లక్షల కిలోమీటర్ల వేగంతో సౌర తుఫాను భూమిని తాకే ఛాన్స్‌ ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ సౌర తుఫాను ముప్పు పోయిందని ఆనందించే లోపే మరో సౌర తుఫాను వేగంగా వస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ సౌర తుఫాను అక్టోబర్‌ 11 నుంచి అక్టోబర్‌ 12 వరకు భూమిని తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే కమ్యూనికేషన్‌ వ్యవస్థ పూర్తిగా అంధకారంలోకి వెళ్తోందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలకు తరచుగా అంతరాయం కూడా కల్గుతున్నట్లు తెలుస్తోంది.  
చదవండి: వారెవ్వా ! వైన్‌తో నడిచే కారు.. యువరాజు కారంటే అంతేమరి!!

భారీగా ప్రభావం..!
సౌర తుఫాను నేపథ్యంలో జీ2 జియోమాగ్నెటిక్‌ తుఫాను భూమిపై భారీగా ప్రభావం చూపుతోందని నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ ఆట్మాస్పియర్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎన్‌ఓఏఏ), స్పేస్‌ వెదర్‌ ప్రిడిక్షన్‌ సెంటర్‌ పేర్కొంది. జియో మాగ్నెటిక్‌ తుఫానులు ఎక్కువగా కోరనల్‌ మాస్‌ ఎజక్షన్‌ వల్ల ఏర్పడుతాయి. అంటే సూర్యుడి కోరనల్‌ (ఉపరితలం)పై జరిగే భారీ విస్పోటనాలతో ఈ తుఫానులు ఏర్పడుతాయి. సూర్యుడి నుంచి వచ్చే కోరనల్‌ మాస్‌ ఎజక్షన్స్‌ భూమిని కేవలం 15 నుంచి 18 గంటల్లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.      

సౌర తుఫాన్‌ భూమిని తాకితే...!

  • రేడియో కమ్యూనికేషన్‌లు బాగా ప్రభావితమయ్యాయి. 
  • జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. 
  • ఇంటర్నెట్‌కు విఘాతం కల్గవచ్చును. 
  • ఆర్కిటిక్‌ దృవాల వద్ద ఏర్పడే అరోరా బొరియాలిస్‌ ఇతర ప్రాంతాల్లో కూడా కన్పిస్తాయి. ముఖ్యంగా న్యూయర్క్‌ లాంటి ప్రాంతాల్లో అరోరా బోరియాలిస్‌ కాంతులను చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
  • ప్రపంచవ్యాప్తంగా పవర్‌గ్రిడ్లలో విద్యుత్‌ హెచ్చుతగ్గులకు కారణమవుతాయి.

చదవండి: కాసుల కోసం కక్కుర్తి..! వాట్సాప్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement