భారత్‌-కెనడా ఉద్రిక్తతలు: ఆనంద్‌ మహీంద్ర సంచలన నిర్ణయం | India Canada Crisis Anand Mahindra Bold Move Triggers Rs 7200 Cr loss | Sakshi
Sakshi News home page

భారత్‌-కెనడా ఉద్రిక్తత: ఆనంద్‌ మహీంద్ర సంచలన నిర్ణయం

Published Fri, Sep 22 2023 5:25 PM | Last Updated on Fri, Sep 22 2023 8:17 PM

India Canada Crisis Anand Mahindra Bold Move Triggers Rs 7200 Cr loss - Sakshi

భారతదేశం-కెనడా ఉద్రిక్తతల నేపథ్యంలో ఎంఅండ్‌ ఎం ఆనంద్ మహీంద్రా అధినేత తీసుకున్న సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. కెనడాలోని మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ, రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఎంఅండ్‌ఎం గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది.  ఇది మార్కెట్‌  వర్గాల్లోనూ, ఇటు బిజినెస్‌ వర్గాల్లో కలకలం రేపింది.  ఈ నిర్ణయం  రూ. 7200 కోట్ల ఆర్థిక సంక్షోభానికి దారితీయడం గమనార్హం.

రెస్సన్ ఏరోస్పేస్ కోసం కార్యకలాపాలు నిలిపివేత.. వివరాలను పరిశీలిస్తే 
భారతదేశం కెనడాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య, కెనడాలోని మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra & Mahindra) అనుబంధ సంస్థ  'రెస్సన్‌ ఏరోస్పేస్ కార్పొరేషన్‌' స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు పేర్కొంటూ కెనడా కార్పొరేషన్స్‌కు దరఖాస్తు చేసింది. దీనికి సెప్టెంబర్‌ 20న ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో ఎంఅండ్‌ఎం స్టాక్‌ను భారీగా ప్రభావితం చేసింది. అంతేకాదు మహీంద్రా కీలక నిర్ణయం ద్వారా  బహుళజాతి సంస్థలు,  పెట్టుబడుల ప్రభావంతోపాటు  విస్తృత ఆర్థిక రంగం మీద దౌత్యపరమైన ఒత్తిళ్లను చెప్పకనే చెప్పింది.  (రూపాయి హై జంప్‌: కారణం ఇదే!)

రూ. 7200 కోట్టు ఆవిరి 
ఈ డిక్లరేషన్ మహీంద్రా & మహీంద్రా షేర్లు 3 శాతం కుప్పకూలాయి. బీఎస్‌ఈ  రూ. 1583.80  వద్ద  ముగిసింది. ట్రేడింగ్ సెషన్‌లో షేర్లు రూ. 1575.75 వద్ద రోజు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇటీవలి నష్టపోయినప్పటికీ  కంపెనీ షేర్లు ఈ సంవత్సరం నిఫ్టీపై దాదాపు 26శాతం  రాబడిని సాధించాయి.  ఒక సంవత్సరం రాబడి 21% మించిపోయింది.  తాజా నష్టాల ఫలితంగా  రూ. 7200 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ప్రారంభ మార్కెట్ క్యాప్ రూ. 2 లక్షల కోట్ల నుండి, కంపెనీ మార్కెట్ విలువ కనిష్టంగా రూ. 1,95,782.18 కోట్లకు క్షీణించి, మార్కెట్ ముగిసే సమయానికి రూ. 1,96,950.10 కోట్ల వద్ద స్థిరపడింది. రెసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్‌లో మహీంద్రా & మహీంద్రా వాటా  11.18 శాతం.(క్యాబ్‌ డ్రైవర్‌ ఖాతాలో ఏకంగా రూ. 9 వేల కోట్లు..ఏం చేశాడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement