అలెక్సా పాత తెలుగు పాటలు కావాలి?
అలెక్సా ఈరోజు వాతావరణం ఎలా ఉంది?
అలెక్సా ఈరోజు వార్తలేంటీ? అంటూ చాలా మంది అడుగుతుంటారు.
ఇలా మనజీవితాల్లో పర్సనల్ అసిస్టెంట్‌గా మారిన అలెక్సా వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారతీయులు 2020తో పోలిస్తే 2021 అలెక్సాను వినియోగించే వారిసంఖ్య 68శాతం పెరగ్గా అందుల్లో 50శాతం మంది కస్టమర్లు నాన్ - మెట్రోనగరాలకు చెందిన వారేనని తెలుస్తోంది.
ఇక అమెజాన్ఇండియా మనదేశంలో అలెక్సా 4వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది.ఈ సందర్భంగా తన వాయిస్ అసిస్టెంట్ అలెక్సా గురించి అమెజాన్ ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ఆసక్తికరంగా, మనదేశంలో గతేడాది మార్చి-ఏప్రిల్ కోవిడ్ సెకండ్ వేవ్ వెలుగులోకి వచ్చినప్పుడు యూజర్లు కోవిడ్ గురించి మనదేశంలో కరోనా సెకండ్ వేవ్ అంట "ఏం చేద్దామంటావ్ మరి!? అలెక్సా అంటూ ప్రశ్నలు సంధించారు. దీంతో పాటు ఆరోగ్యం,వెల్ నెస్ సంబంధిత అంశాల గురించి ప్రతిరోజూ 11,500 ప్రశ్నలు అడిగారు.
అమెజాన్ ప్రకారం, క్రీడలు, సినిమా డైలాగ్‌లు, పదాల నిర్వచనాలు, కఠినమైన గణిత సమస్యలు, వాతావరణం, తాజా స్టాక్ మార్కెట్ అప్‌డేట్‌లకు సంబంధించి అలెక్సా రోజువారీ 1.7 లక్షల ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
భారతీయ కస్టమర్‌లు ప్రతిరోజూ 21.6 లక్షల కంటే ఎక్కువ పాటలను ప్లే చేసారు, పిల్లలు, భక్తి, ప్రాంతీయ భాష వంటి జానర్‌లు టాప్ 20 పాటల్లో ప్రముఖంగా ఉన్నాయి.
అలెక్సా ప్రతిరోజు స్మార్ట్ గృహోపకరణాలను నియంత్రించడం కోసం 2.6 లక్షలకు పైగా అభ్యర్థనలకు ప్రతిస్పందించింది.
షావోమీ,వన్ ప్లస్, హింద్‌వేర్, ఆటోమ్ బెర్గ్ వంటి బ్రాండ్‌ల నుండి కొత్త ఉత్పత్తులతో అలెక్సా స్మార్ట్ హోమ్ ఎంపిక సంవత్సరానికి 72 శాతం పెరిగింది.
కస్టమర్‌లు తమ రోజులను అలెక్సాతో ప్రారంభించడం ముగించడాన్ని ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ "అలెక్సా, గుడ్ మార్నింగ్ "అలెక్సా, గుడ్ నైట్" అని 11,520 సార్లు విష్ చేస్తున్నారు. అలెక్సా వినియోగదారు ప్రశ్నలను అర్థం చేసుకోవడంలో, ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ లోపాలను 25 శాతం తగ్గించిందని అమెజాన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment