Amazon Echo Show : ఎక్కడి నుంచైనా స్పష్టంగా చూడొచ్చు | Amazon Released Newly Developed Echo Show Devices In India Which Are Monitored From Any Where With Alexa Feature | Sakshi
Sakshi News home page

Amazon Echo Show : ఎక్కడి నుంచైనా స్పష్టంగా చూడొచ్చు

Published Fri, Jul 2 2021 10:20 AM | Last Updated on Fri, Jul 2 2021 10:43 AM

Amazon Released Newly Developed Echo Show Devices In India Which Are Monitored From Any Where With Alexa Feature - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఆధునీకరించిన ఎకో షో–10, ఎకో షో–5 ఉపకరణాలను భారత్‌లో ప్రవేశపెట్టింది. 10.1 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాతో ఎకో షో–10 రూపుదిద్దుకుంది. ఇంటెలిజెంట్‌ మోషన్‌ ఫీచర్‌ దీనికి పొందుపరిచారు. దీంతో గదిలో ఎటువైపున ఉన్నా వీడియోలు వీక్షించేందుకు వీలుగా డిస్‌ప్లే కదులుతుంది.

అలెక్సాతో...
అమెజాన్‌ ఎకో షో–10 ధర రూ.24,999. స్మార్ట్‌ స్పీకర్‌ ఎకో షో–5 డివైజ్‌కు 5.5 అంగుళాల స్క్రీన్, వీడియో కాల్స్‌ కోసం అప్‌గ్రేడ్‌ చేసిన హెచ్‌డీ కెమెరా ఏర్పాటు చేశారు. ఎకో షో–5 ధర రూ.6,999 ఉంది. అలెక్సా యాప్‌ ద్వారా డివైజ్‌లోని బిల్ట్‌ ఇన్‌ కెమెరా సాయంతో ఇంటిని ఎక్కడి నుంచైనా పర్యవేక్షించవచ్చు.  
 

చదవండి : కాఫీడే....చేదు ఫలితాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement