న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సిబ్బందిని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీకి భారత్‌లో 1 లక్ష మంది ఉద్యోగులు ఉండగా సుమారు 1 శాతం సిబ్బందిపై ఉద్వాసనల ప్రభావం పడవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రపంచవ్యాప్తంగా 18,000 మందిని తొలగించాలని నిర్ణయం తీసుకోవడంతో భారత్‌లో 1,000 మంది సిబ్బందిపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
మరోవైపు అంతర్జాతీయంగా తమ అమెజాన్ స్టోర్స్, పీఎక్స్‌టీ (పీపుల్, ఎక్స్‌పీరియన్స్, టెక్నాలజీ) విభాగాల్లో ఎక్కువగా కోతలు ఉండనున్నాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. 2021 డిసెంబర్ 31 నాటికి అమెజాన్‌లో 16,08,000 మంది ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment