కేంద్ర కార్మిక జారీ చేసిన నోటీసులపై అమెజాన్ స్పందించింది. భారత్‌కు చెందిన ఏ ఉద్యోగిని రాజీనామా చేయాలని బలవంతం చేయలేదని స్పష్టం చేసింది.
అమెజాన్ భారత చట్టాల్ని ఉల్లంఘిస్తుందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఆరోపించింది. అంతేకాదు ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలన్న అమెజాన్ ఆదేశాలపై ఉద్యోగుల సంఘం కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది.
ఆ ఫిర్యాదు మేరకు కార్మిక శాఖ బెంగళూరులోని డిప్యూటీ లేబర్ కమిషనర్ ముందు అమెజాన్ ప్రతినిధి నేరుగా హాజరవ్వాలని సూచించింది. లేఆఫ్స్‌పై వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేసింది. కార్మిక శాఖ పంపిన నోటీసులకు అమెజాన్ స్పందించింది.
ఉద్యోగులు రాజీనామా చేయాలని బలవంతం చేయడం లేదు. స్వచ్ఛందంగా ఉద్యోగానికి రిజైన్ చేస‍్తే నష్టపరిహారం చెల్లిస్తామని మాత్రమే చెప్పాం. మేం(అమెజాన్) ప్రతి ఏడు అన్నీ విభాగాలకు చెందిన ఉద్యోగులపై సమీక్షిస్తాం. పునర్‌వ్యవస్థీకరణ అవసరమని భావిస్తే ఉద్యోగి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, అందుకు పరిహార ప్యాకేజీ చెల్లిస్తుంటాం. రిజైన్ చేయాలన్న ప్రతిపాదనలకు అంగీకరించడం, లేదంటే రాజీనామా చేయడం అనేది ఉద్యోగులదే తుది నిర్ణయం. మేం ఏ ఒక్క ఉద్యోగిని సంస్థను విడిచి వెళ్లాలని బలవంతం చేయడం లేదని లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది.
చదవండి👉 భారీ షాక్, మరో రంగానికి చెందిన వేలాది మంది ఉద్యోగుల తొలగింపు
Comments
Please login to add a commentAdd a comment