ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్ వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారిలో భారతీయులు సైతం ఉన్నారు. లేఆఫ్స్‌తో కొత్త ఉద్యోగం దొరక్కపోవడంతో తిరిగి భారత్‌కు వస్తున్నారు.
మాద్యం, వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో వినియోగారులు కొనుగోలు విషయాల్లోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఫలితంగా చాలా కంపెనీలు తమ వ్యయాలను నియంత్రించకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే మెటా, గూగుల్, అమెజాన్ , మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇతర సంస్థలు సైతం ఇంకా ఫైర్ చేస్తూనే ఉన్నాయి.
అమెజాన్‌లో 18,000 మంది తొలగింపు
జనవరిలో అమెజాన్ 18,000 మందిని తొలగించింది. ఆ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అనేక కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అసలే ఉద్యోగం పోగొట్టుకుని బాధపడుతున్న వారికి ఇప్పుడు హెచ్1బీ వీసా రూపంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త ఉద్యోగం దొరక్కపోవడంతో అమెరికన్ ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం.. అగ్రరాజ్యంలో ఉండేందుకు వీలు లేకపోవడంతో లేఆఫ్స్‌కు గురైన అమెజాన్ మాజీ ఉద్యోగులు తిరిగి భారత్‌కు వస్తున్నారు.
వేల సంఖ్యలో రిజెక్షన్‌లు
ఈ నేపథ్యంలో లేఆఫ్స్ తరువాత తాను ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్ని అమెజాన్ మాజీ ఉద్యోగి లింక్డిన్‌లో పోస్ట్‌లో వివరించారు. అమెరికా కేంద్రంగా అమెజాన్ ప్రధాన కార్యాలయంలో డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహించే వారు. అయితే, సంస్థ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగం పోయింది. అనంతరం రెండు నెలల పాటు కొత్త ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాల్లో అన్నీ విఫలమయ్యాయి. ఈ సమయంలో తాను అనేక ఇంటర్వ్యూలకు హాజరయ్యానని, కానీ వేలాది తిరస్కరణలను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు.
మళ్లీ అమెరికా వెళ్తా.. సాయం చేయరూ
'మీలో చాలా మందికి తెలిసినట్లుగా, గత కొన్ని నెలలు నాకు పరిస్థితులు అత్యంత కఠినంగా ఉన్నాయి. అమెజాన్‌లో ఉద్యోగం కోల్పోయిన తర్వాత, సామూహిక తొలగింపుల మధ్య, నేను వెయ్యికి పైగా ఉద్యగాలకు అప్లయ్ చేసుకున్నాను. దాదాపు అందరూ రిజెక్ట్ చేశారు. ఇంటర్వ్యూలు కాల్స్ రాకపోవడం, ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేసినా నా ప్లేస్‌లో వేరే వారిని తీసుకోవడం, రిక్రూటర్లు మరోసారి ఇంటర్వ్యూలు చేయడం, వాటి గురించి సమాచారం లేకపోవడంతో అనే తిరస్కరణలు ఎదురయ్యాయి. నాకు హెచ్-1బీ వీసా ఉన్నందున నెల రోజుల క్రితం కఠిన పరిస్థితుల మధ్య భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చిందని వాపోయారు.
ఉద్యోగం లేదు. పొదుపు చేసిన డబ్బూ ఉంది. అప్పూ ఉంది. అందుకే పొదుపు చేసిన డబ్బు ఖర్చు చేయకూడదనే ఉద్దేశంతో తిరిగి భారత్‌కు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అమెరికాకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. తనకు సాయం చేయాల్సిందిగా తన సన్నిహితులను కోరారు.
చదవండి👉🏻 ఎలాన్ మస్క్ హత్యకు గురవుతారేమో
Comments
Please login to add a commentAdd a comment