Boycott Flipkart: ఇటీవల కంపెనీలు ప్రతీది వ్యాపార కోణంలోనే చూస్తున్నాయి. తమ వస్తువుల మార్కెటింగ్ విషయంలో కంటెంట్‌ని కాకుండా కాంట్రవర్శీతో లాభాలను పొందాలని భావిస్తున్నాయి. సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి ఇలాంటి వాటినే పబ్లిసిటీ స్టంట్‌గా చేసుకుని దాన్ని వ్యాపారంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. ప్రస్తుతం ఇదే తరహాలో దేశంలోని అతిపెద్ద ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ పాటించింది. వీళ్ల మార్కెటింగ్ పైత్యం చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది..
ఈ కామర్స్ సైట్‌లో ఓ టీ-షర్ట్ పై సుశాంత్ ఫోటోతో పాటు "డిప్రెషన్ ఈజ్ డ్రోయింగ్" అనే ట్యాగ్‌లైన్‌తో వాటిని అమ్ముతున్నారు. ఇదే కాంట్రవర్సీకి తెర తీసింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోటోని చూసిన సుశాంత్ సింగ్ అభిమాని, ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ బాయ్‌కాట్ ఫ్లిప్‌కార్ట్ హ్యాష్‌ట్యాగ్ పెట్టాడు. అప్పటి నుంచి ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయిపోయింది. వెంటనే అన్ని ఇ-కామర్స్ సైట్ నుంచి ఆ టీ షర్ట్‌లని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ .. తమ వస్తువుల సేల్ కోసం ఇంతకి దిగజారుతారా అని కామెంట్ చేయగా, మరొకరు ఫ్లిప్‌కార్ట్‌కి ఎందుకీ పైత్యం.. ఇలాంటి చీప్‌ట్రిక్స్ ఆపాలంటూ కామెంట్ చేశారు. మరొక యూజర్ "చనిపోయిన వ్యక్తి ఫోటోను టీ షర్ట్‌పై పెట్టడమే కాకుండా, అలాంటి కోట్‌ను యాడ్ చేస్తారా" అంటూ ఓ నెటిజన్ తీవ్రంగా మండిపడ్డాడు.
How dare you @Flipkart & @amazon call Sushant depressed? There is absolutely no evidence proving he was depressed.
Stop maligning Sushant's image
Remove it right now#BoycottFlipkart #boycottAmazon
Smear Campaign Against SSR pic.twitter.com/uH0M5wknYI
— Justice seeker-Kritika🔱 (@Kritika4Sushant) July 27, 2022
చదవండి: New Delhi: దేశంలో ఆఫీస్ స్పేస్.. ఆ నగరం చాలా కాస్ట్‌లీ గురూ!
Comments
Please login to add a commentAdd a comment