అలర్ట్‌: మైండ్‌ బ్లోయింగ్‌ ఆఫర్లు, 75శాతం డిస్కౌంట్‌.. | Hurry Flipkart Big Day Saving Sale Big Discounts August 6 To 10 | Sakshi
Sakshi News home page

అలర్ట్‌: మైండ్‌ బ్లోయింగ్‌ ఆఫర్లు, 75శాతం డిస్కౌంట్‌..

Published Wed, Aug 10 2022 4:26 PM | Last Updated on Thu, Aug 11 2022 4:23 AM

Hurry Flipkart Big Day Saving Sale Big Discounts August 6 To 10 - Sakshi

కస్టమర్లకు బంపరాఫర్లను ప్రకటించాయి ఈకామర్స్‌ సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ రెండు సంస్థలు పోటీ పడి మరి కస్టమర్లకు భారీ డిస్కౌంట్‌లు ఇస్తున్నాయి.

అమెజాన్‌ ఆగస్ట్‌ 6న నుంచి గ్రేట్‌ ఫ్రీడం ఫెస్టివల్‌ సేల్‌ను నిర్వహిస్తుండగా.. ఫ్లిప్‌కార్ట్‌ ఆగస్ట్‌ 6 నుంచి ఆగస్ట్‌ 10 వరకు బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు డిస్కౌంట్‌ల కోసం వెయిట్‌ చేస్తున్న షాపింగ్‌ ప్రియులు, గ్యాడ్జెట్‌ లవర్స్‌ త్వరపడాల్సి సమయం ఇది, ఎందుకంటే ఈ ఆఫర్లు బుధవారమే ఆఖరి రోజు ( ఆగస్టు 10) ముగియనుంది.

మైండ్‌ బ్లోయింగ్‌ ఆఫర్లు....
ఫ్లిప్‌కార్ట్ సేల్ ఈవెంట్‌లో కోటక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.  టీవీలు, గృహోపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపు ఉండనుంది. ఈ ఆఫర్‌ను శాంసంగ్‌ (Samsung), రియల్మీ (Realme), షావోమీ (Xiaomi) తో పాటు ఇతర బ్రాండ్‌ల టీవీలలో కూడా చూడవచ్చు. అంతేనా ఎయిర్ కండీషనర్లపై 55 శాతం వరకు తగ్గింపు,  మైక్రోవేవ్‌లపై 45 శాతం వరకు తగ్గింపు కూడా ఉంటుంది. 

మీరు స్మార్ట్‌వాచ్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా! అయితే ఇదే మంచి సమయమని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. వాటిపై 10 నుంచి 70 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌లు కాకుండా, అదే సమయంలో యాపిల్‌, వివో,ఒప్పో, మోటరోలాతో పాటు ఇతర బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు పొందవచ్చని తెలపింది. ఎప్పటిలాగే, ఉదయం 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు "క్రేజీ డీల్స్" కూడా ఉండనుంది. 

చదవండి: ఆ లోన్‌ తీసుకున్నవారికి భారీ షాక్‌.. .. ప్చ్‌, ఈఎంఐ మళ్లీ పెరిగింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement