![Amazon Alexa Skill Ask Apollo From Apollo Group - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/26/apollo.jpg.webp?itok=GEHHCKo3)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ హాస్పిటల్ చెయిన్ అపోలో గ్రూప్ వాయిస్ ఆధారిత యాప్ ‘అమెజాన్ అలెక్సా స్కిల్– ఆస్క్ అపోలో’ను ఆవిష్కరించింది. దీంతో వాయిస్ కమాండ్‌తో దగ్గర్లోని అపోలో ఆసుపత్రులు, క్లినిక్స్, ఫార్మసీల వివరాలు తెలుసుకోవచ్చని, డాక్టర్ల అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చని అపోలో గ్రూప్ ప్రకటన తెలిపింది. దేశవ్యాప్తంగా 72 అపోలో ఆసుపత్రులు, 5 వేల మంది వైద్యులు, 3,500 ఫార్మసీలు, 90 క్లినిక్స్, 15 డయాగ్నోస్టిక్ సెంటర్లు, 110 టెలిమెడిసిన్ సెంటర్లు, 15 మెడికల్ ఎడ్యుకేషన్ సెంటర్లు ఈ యాప్‌తో అనుసంధానమై ఉన్నట్లు సంస్థ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment