
యంత్రాలతో ఎంత సౌలభ‍్యం ఉందో, ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఒక్కోసారి అంతే ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఏదైనా తేడా వస్తే..వచ్చే తిప్పలు అనుభవించినవారికి మాత్రమే అర్దమౌతాయి. తాజాగా ఇలాంటి వీడియో నొకదాన్ని ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. తరచూ ఇన్నోవేటివ్ ఐడియాలు, స్టోరీలను ట్విటర్‌లో తన ఫాలోయిర్స్‌కు షేర్ చేసే ఆయన ఈసారి అలెక్సా వాయిస్ అసిస్టెంట్ గురించి ట్వీట్ చేశారు. అలెక్సాను ఆహ్వానించాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిందే అంటూ సరదాగా కామెంట్ చేశారు. వాయిస్ కమాండ్స్ ఆధారంగా పనిచేసే అలెక్సాతో ఒక యువకుని కష్టాలు ఈ వీడియోలో చూడొచ్చు. అయ్యో పాపం... అనిపించినా.. కాసేపు పొట్టచెక్కలవ్వడం కాయం..
కాగా ఇంట్లోని వస్తువులన్నింటినీ వాయిస్ కమాండ్స్‌తోనే కంట్రోల్ చేయగల అలెక్సా ఒక సంచలనమనే చెప్పాలి. సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరించేందుకు ఇండియన్ మార్కెట్‌లోకి ఇటీవల అందుబాటులోకి వచ్చింది అలెక్సా. దీని ద్వారా లైట్, ఏసీ, టీవీలను అలెక్సా అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్స్‌తో కంట్రోల్ చేయవచ్చు. అలాగే క్రికెట్ అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్, మ్యూజిక్ లాంటి వివరాలు నేరుగా వాయిస్ కమాండ్స్ ద్వారా పొందవచ్చు. అంతేనా ఓలా, ఊబర్ అకౌంట్స్ జత చేస్తే కేవలం వాయిస్ కమాండ్స్‌తోనే క్యాబ్ బుక్ చేసుకోవవచ్చు. అయితే ఈ వీడియో ఇండియాలోది కాదు..
Comments
Please login to add a commentAdd a comment