ఇది వినూత్నమైన బెడ్‌లైట్. ఉత్త బెడ్‌లైట్ మాత్రమే కాదు, ఇది అలారం కూడా! చక్కగా నిద్రపుచ్చడమే కాకుండా, వేళకు మేల్కొల్పుతుంది. ఇందులోని ఆరు వాట్ల బ్లూటూత్ స్పీకర్ సిస్టమ్ మరో అదనపు సౌకర్యం.
పడుకునే సమయంలో ఈ బెడ్‌లైట్‌ను ఆన్ చేసుకుని, స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న దీని యాప్ సాయంతో కోరుకున్న సంగీతాన్ని మంద్రంగా వింటూ హాయిగా నిద్రలోకి జారుకోవచ్చు. ఇది అలెక్సా సాయంతో పనిచేస్తుంది. కళ్లకు ఇబ్బంది లేకుండా దీని కాంతిని కోరుకున్న స్థాయిలో, కోరుకున్న రంగుల్లో సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
ఇదీ చదవండి: ఆధార్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. పుట్టిన బిడ్డకు ఎంతో మేలు!
పడుకునే ముందు పొద్దున్నే నిద్ర లేవాల్సిన సమయాన్ని అలారంలో సెట్ చేసుకుంటే చాలు. వేళకు ఠంచనుగా నిద్రలేపుతుంది. అమెరికన్ కంపెనీ డబ్ల్యూఐఐఎం ఈ అలారం బెడ్‌లైట్‌ను ‘వేకప్ లైట్’ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చింది. దీని ధర 129 డాలర్లు (రూ.10,584) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment