లోక్‌సభ ఎన్నికల వేళ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేస్తున్న పనులకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఒకవైపు పంజాబ్‌లోని సంగ్రూర్ లోక్‌సభ నియోజవర్గంలో కల్తీ మద్యం బారినపడిన మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు.. గతంలో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. బాలీవుడ్ సింగర్ సుఖ్విందర్ సింగ్, పాటల రచయిత బబ్బు మాన్‌తో కారులో ప్రయాణిస్తూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
While Rome was burning Nero was playing flute !
— Sunil Jakhar(Modi Ka Parivar) (@sunilkjakhar) March 21, 2024
Following in the foot steps of Nero, Bhagwant Mann ji is singing tappas while people in own constituency Sangrur are dying of illicit liquor.
ਜਦੋਂ ਰੋਮ ਸੜ ਰਿਹਾ ਸੀ ਤਾਂ ਨੀਰੋ ਬੰਸਰੀ ਵਜਾ ਰਿਹਾ ਸੀ!
ਨੀਰੋ ਦੇ ਨਕਸ਼ੇ-ਕਦਮਾਂ 'ਤੇ ਚੱਲ ਕੇ ਭਗਵੰਤ… pic.twitter.com/uAVvzz9Ybf
‘రోమ్ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ప్లూట్ వాయించినట్ల ఉంది భగవంత్ మాన్ వ్యవహారం. ఒకవైపు కల్తీ మద్యంతో ప్రజలు మరణిస్తుంటే.. భగవంత్ మాన్ పాటలు పాడుతున్నారు’అని పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ తీవ్ర విమర్శలు చేశారు. భగవంత్ మాన్‌కు సంబంధించిన వీడియోను సునీల్ జాఖర్ తన ఎక్స్( ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నా శాంతి భద్రతల పరిస్థితుల విషయంపై కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా మండిపడ్డారు.
‘దిర్బా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనిమిది మంది కల్తీ మద్యం బారినపడి మరణించారు. ఈ నియోజకవర్గానికి పంజాబ్ ఎక్సైస్ మంత్రి పాతినిధ్యం వహిస్తున్నారు. దిర్బా.. సంగ్రూర్ లోక్‌సభ పరిధితో వస్తుంది. అది సీఎం భగవంత్ మాన్ సొంత జిల్లా. ఆప్ ప్రభుత్వం కనీసం బాధ్యత వహించపోవటం దారణం’అని ప్రతాప్ సింగ్ విమర్శలు చేశారు. ఇక.. ఇటీవల చోటు చేసుకున్న కల్తీ మద్యం మరణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
చదవండి: Punjab CM: ఎన్నికల వేడి.. హోటల్‌లో రోజంతా సీఎం రిలాక్స్!
Comments
Please login to add a commentAdd a comment