
కరోనా లాక్‌డౌన్ సయమంలో ఫిలిమ్ మేకర్ కరణ్ జోహార్ అభిమానులకు వినోదాన్ని అందించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. తన పిల్లలు యశ్, రూహిలతో కలిసి పలు వీడియోలు, ఫోటోలు రూపొందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియో ఎంతో ఫన్నీగా ఉండటం, నెటిజన్లను ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. రూహీ, యశ్‌లు పాత హిందీ పాటలను వింటూ ఆస్వాదిస్తుండగా కరణ్ వచ్చి పాట పాడటం ప్రారంభించాడు. దీంతో రూహీ వెంటనే ‘నువ్వు పాట పాడితే నాకు తలనొస్తుంది’అని అంటున్న మరో పాట అందుకున్నాడు కరణ్. అయితే ఈసారి యశ్ కూడా ‘నాన్న నువ్వు పాట పాడితే మాకు తలనొప్పిగా ఉంది’ అని అనడంతో కరణ్ పాట పాడటం ఆపేశాడు. ఎంతో క్యూట్, ఫన్నీగా ఉన్న ఈ వీడియో కేవలం గంట వ్యవధిలోనే మూడు లక్షలకుపైగా మంది వీక్షించగా వేల మంది లైక్ చేశారు.
చదవండి:
‘అది వాషింగ్ మెషీన్ కాదు యశ్’
‘దీపికా’ రాజకీయవేత్త అని మీకు తెలుసా?