‘అది వాషింగ్‌ మెషీన్‌ కాదు యశ్‌’ | Karan Johars Son Yash Closet Mistake Tijori For Washing Machine | Sakshi
Sakshi News home page

‘లాకర్‌ను వాషింగ్‌ మెషీన్‌ అనుకుంటున్న యశ్‌‌’

May 7 2020 1:27 PM | Updated on May 7 2020 2:03 PM

Karan Johars Son Yash Closet Mistake Tijori For Washing Machine - Sakshi

కరోనా కల్లోలంతో జనజీవనం ఎ​క్కడికక్కడా స్తంభించిపోయింది. ఇక లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు రద్దవ్వడంతో సినిమావాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. అయితే అనూహ్యంగా దొరికిన లాక్‌డౌన్‌ సమయాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి తెగ ఎంజయ్‌ చేస్తున్నారు. అయితే కేవలం వారు మాత్రమే ఎంజయ్‌ చేయకుండా పలు వెరైటీ వీడియోలతో అభిమానులను కూడా అలరిస్తున్నారు. బాలీవుడ్‌ ఫిలింమేకర్‌ కరణ్‌ జోహార్‌ కూడా లాక్‌డౌన్‌ సమయంలో తన ఫ్యాన్స్‌కు తగినంత వినోదాన్ని అందించేందుకు సిద్దమయ్యాడు. 

ఈ క్రమంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లాక్‌డౌన్‌విత్‌దజోహార్‌’ పేరిట పలు వీడియోలను, ఫోటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా తన పిల్లలు యశ్‌, రూహీలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు నెటిజన్లును తెగ ఆకర్షిస్తున్నాయి. తాజాగా కరణ్‌ షేర్‌ చేసిన వీడియోలో యష్‌ తమ ఇంట్లోని లాకర్‌ను చూసి వాషింగ్‌మెషీన్‌ అని పొరపాటు పడతాడు. ఈ విషయాన్ని చాక్లెట్‌ తింటూ ఎంతో ఫన్నీగా ముద్దుముద్దుగా చెప్పడంతో కరణ్‌ నవ్వుతూనే అది వాషింగ్‌ మెషీన్‌ కాదని లాకర్‌ అని వివరిస్తాడు. ఎంతో ఫన్నీగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

చదవండి:
‘కరోనా రాలేదు.. క్వారంటైన్‌కు పంపలేదు’
విష్ణు ఎంట్రీ మాములుగా లేదు కదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement