ఋషీపీఠం ఆధ్వర్యంలో రెండో శివపదాల అంతర్జాతీయ పోటీలు జరిగాయి. మే 13 నుంచి 15 వరకు యూట్యూబ్ మాధ్యమంగా ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నాలుగు ఖండాలలోని పద్నాలుగు దేశాలకు చెందిన 300 మంది ఔత్సాహిక గాయకులు ఈ పాటల పోటీల్లో పాల్గొన్నారు. సామవేదం షణ్ముఖ శర్మ రచించిన వెయ్యికి పైగా శివపద గీతాల్లో కొన్నింటిని ఈ పోటీలో ఆలపించారు.
షణ్ముఖుని శివుని ఆరు విభాగాలతో తలపిస్తు ఆరు పూటల జరిగిన ఈ కార్యక్రమం కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పరిచయవ్యాఖ్యలతో మొదలయ్యింది. ప్రవాసులయిన ఎందరో పిల్లలు సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో, స్పష్టమైన ఉఛ్చారణతో శృతి, లయ బద్ధంగా అద్భుతముగా ఆలపించారు. చిన్మయ జ్యోతిర్మయలింగం, పాలవన్నెవాడు, శివుడు ధరించిన, సకలమంత్రముల సంభవమూలం, సభాపతి పాహిపాహిమామ్ శివపద కల్యాణం తదితర గీతాలు ఆలపించారు.
శివపదం కోసం తన జీవితపరమావధిగా, సార్ధకతగా రాసుకున్న పాటలను, ఇంత మంది వాటిని చక్కగా పాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని షణ్ముఖ శర్మ అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాణి, రవి గుండ్లపల్లిలను అభినందించారు. ఈ కార్యక్రమానికి భారత్, ఆస్ట్రేలియా, సింగపూర్, అమెరికాలకు చెందిన పదహారు మంది సంగీత దర్శకులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment