samavedam shanmukha sharma
-
జగమంతా శివపదం
ఋషీపీఠం ఆధ్వర్యంలో రెండో శివపదాల అంతర్జాతీయ పోటీలు జరిగాయి. మే 13 నుంచి 15 వరకు యూట్యూబ్ మాధ్యమంగా ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నాలుగు ఖండాలలోని పద్నాలుగు దేశాలకు చెందిన 300 మంది ఔత్సాహిక గాయకులు ఈ పాటల పోటీల్లో పాల్గొన్నారు. సామవేదం షణ్ముఖ శర్మ రచించిన వెయ్యికి పైగా శివపద గీతాల్లో కొన్నింటిని ఈ పోటీలో ఆలపించారు. షణ్ముఖుని శివుని ఆరు విభాగాలతో తలపిస్తు ఆరు పూటల జరిగిన ఈ కార్యక్రమం కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పరిచయవ్యాఖ్యలతో మొదలయ్యింది. ప్రవాసులయిన ఎందరో పిల్లలు సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో, స్పష్టమైన ఉఛ్చారణతో శృతి, లయ బద్ధంగా అద్భుతముగా ఆలపించారు. చిన్మయ జ్యోతిర్మయలింగం, పాలవన్నెవాడు, శివుడు ధరించిన, సకలమంత్రముల సంభవమూలం, సభాపతి పాహిపాహిమామ్ శివపద కల్యాణం తదితర గీతాలు ఆలపించారు. శివపదం కోసం తన జీవితపరమావధిగా, సార్ధకతగా రాసుకున్న పాటలను, ఇంత మంది వాటిని చక్కగా పాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని షణ్ముఖ శర్మ అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాణి, రవి గుండ్లపల్లిలను అభినందించారు. ఈ కార్యక్రమానికి భారత్, ఆస్ట్రేలియా, సింగపూర్, అమెరికాలకు చెందిన పదహారు మంది సంగీత దర్శకులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. చదవండి: సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు -
సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగువాహిని సాహితీ సదస్సు
సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగువాహిని మూడవ సాహితీ సదస్సు అంతర్జాలంలో విజయవంతంగా ముగిసింది. ఐదు గంటల సేపు నిర్విరామంగా కొనసాగిన సాహితీ సదస్సులో ముఖ్య అతిథులుగా వంగూరి చిట్టెన్ రాజు, ట్యాగ్ లైన్ కింగ్ ఆలపాటి, డా. మూర్తి జొన్నలగడ్డ, రత్నకుమార్ కవుటూరి, సిడ్నీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు మధు బైరెడ్డి ఇంకా పలువురు తెలుగువారు పాల్గొన్నారు. ఈ సాహితీ సదస్సులోనే పెయ్యేటి శ్రీదేవి కథల సంపుటి ''పిల్లలరాజ్యం' సామవేదం షణ్ముఖశర్మ అంతర్జాలంలో ఆవిష్కరించారు. శ్రీదేవి కథలపుస్తకంపై భువనచంద్ర, డా. కె.వి. కృష్ణకుమారి తమ అభిప్రాయాలను తెలిపారు. గతంలో వెలువడిన 'బియ్యంలో రాళ్ళు' 'పిల్లలరాజ్యం' ఇంటింట ఉండాల్సిన కథా పుస్తకాలని సామవేదం షణ్ముఖశర్మ అభిప్రాయపడ్డారు. పిల్లలరాజ్యం కథలపుస్తకం అంతర్జాతీయంగా మూడు దేశాలలో జూమ్ వేదికగా ఆవిష్కరణ కార్యక్రమం రూపొందించటం జరిగిందని తెలుగు వాహిని కన్వీనర్ విజయ గొల్లపూడి తెలిపారు. భారత్‌లో పిల్లలరాజ్యం కథల సంపుటిని సుధామ ఆవిష్కరించారు. పుస్తక పరిచయం గంటి భానుమతి చేయగా.. పెయ్యేటి శ్రీదేవితో ఆత్మీయ అనుబంధం గురించి పొత్తూరి విజయలక్ష్మి తెలిపారు. సిడ్నీలో మొదటి తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దుర్వాసుల మూర్తి, పలువురు ప్రముఖులు పెయ్యేటి శ్రీదేవి కథ శైలి, సునిశిత పరిశీలనా శక్తి, సామాజిక భాద్యతను కలిగిన చక్కని కథలని కొనియాడారు. తెలుగు వన్ గ్రూప్ అధినేత రవిశంకర్ కంఠమవేని శ్రీదేవి కథలు నాటికలుగా ప్రసారమయ్యాయని గుర్తుచేశారు. కుమార్తెలు విజయ గొల్లపూడి ఆస్ట్రేలియా నుంచి, కాంతి కలిగొట్ల అమెరికా నుంచి ఇంకా శ్రీదేవి భర్త పెయ్యేటి రంగారావు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రచయిత్రులు సంధ్య గొల్లమూడి, తమిరిశ జానకి, భావరాజు పద్మిని, బంధుమిత్ర సన్నిహితులు పాల్గొన్నారు. 26న జరగనున్నకెనడా అమెరికా సాహితీసదస్సులో కూడా పిల్లలరాజ్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుందని కాంతి కలిగొట్ల తెలిపారు. -
ఏడు నృత్య రీతుల్లో గురు దక్షిణ
ఆది గురువు పరమ శివుడికి అద్భుతమైన గురు దక్షిణ సమర్పించారు ప్రవాస భారతీయులు. ద్వాదశ జ్యోతిర్లింగాల మహిహను ఏడు సంప్రదాయ నృత్య రీతుల్లో అమోఘంగా ప్రదర్శించారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని సామవేదం షణ్ముఖశర్మ రచించిన శివపద కీర్తనలకు అమెరికా , రష్యా దేశాల్లో నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. జులై 23వ తేదిన రుషిపీఠం వేదికగా ఈ వర్చువల్ నృత్య ప్రదర్శన జరిగింది. మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథుడి ఆవిర్భావఘట్టం నుంచి మొదలు పెట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలను వర్ణిస్తూ సామవేదం షణ్ముఖశర్మ రచించిన కీర్తనలకు అనుగుణంగా నృత్య ప్రదర్శన చేశారు. ప్రముఖ నాట్యకారిణి వాణీ గుండ్లపల్లి వన్ నెస్ ఆఫ్ గాడ్ అనే కాన్సెప్ట్‌తో భారత దేశం లోని పన్నెండు జ్యోతిర్లింగాల విశిష్టతను ఏడు శాస్త్రీయ నృత్య రీతులలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అమెరికా, రష్యా దేశాలకు చెందిన 11 నృత్య శిక్షణాలయాలకు చెందిన 58 మంది గురు- శిష్యుల బృందం పాల్గొన్నారు. ఆది గురువు పరమ శివుడి జ్యోతిర్లింగాలతో పాటు పరమేశ్వరుడి మహిమను కళ్లకు కట్టినట్టుగా కూచిపూడి, భరతనాట్యం, మొహినియాట్టం, మణిపురి , ఒడిస్సి , కథక్ , ఆంధ్రనాట్య నృత్య రీతులలో సమ్మోహనకరంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో రాజేష్ శిష్యబృందం (కూచిపూడి), చందన శిష్యబృందం, నైనా శిష్య బృందాలు (భరత నాట్యం), భిధీష, సీమ శిష్యబృందాలు (ఒడిస్సీ) సరస్వతి శిష్యబృందం (మోమినియట్టం), హేమ శిష్యబృందం (ఆంధ్ర నాట్యం), మిత్ర శిష్యబృందం (మణిపురి), ప్రగ్య , దిపన్విత శిష్యబృందాలు (కథక్)లు ప్రదర్శించారు. గురుపౌర్ణమి సందర్భంగా పరమ శివుడి గొప్ప నృత్య రూపకంగా గొప్పగా ప్రదర్శించారంటూ వాణీ గుండ్లపల్లి , రవి గుండ్లపల్లిలను సామవేదం షణ్ముఖ శర్మ అభినందించారు. సామవేదం షణ్ముఖ శర్మ తెలుగు, సంస్కృత భాషలలో 1100 పైగా శివపదం కీర్తనలు రచించారు. వాటిలో దాదాపు 200 పైగా కీర్తనలకు స్వరకల్పన జరిగింది. -
ధర్మ సందేహం
నాకు రుద్ర నమకం, చమకం వంటివి రావు. రోజూ ఓ వెండి శివలింగాన్ని పూజిస్తుంటాను. అయితే రుద్రంతో తప్ప శివుని పూజించకూడదని, అసలు శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోరాదని కొందరంటున్నారు. నిజమేనా? – పిచ్చిక జ్ఞాన సుబ్రహ్మణ్యం, కాకినాడ మీరు విన్నవి సరైనవి కావు. శివలింగాన్ని ఇంటిలో ఉంచుకుని పూజించడం ఐశ్వర్యకరం. రుద్ర నమకాదులతో అభిషేకించడం, పూజించడం మంచిది. అలాగని రుద్రనమకాదులతోనే పూజించాలన్న నిబంధన ఏమీ లేదు. శివనామాలు చెప్పుకుంటూ అభిషేకించవచ్చు. అష్టోత్తర శతనామాలతోనూ అభిషేకించవచ్చు. ఏదీ రానప్పుడు ‘శివాయ నమః అనో, నమఃశివాయ అనో పూజించడం కూడా సత్ఫలితాలనే ఇస్తుంది. బోళాశంకరుడు, భక్తవశంకరుడు, భక్త సులభుడు అయిన శివుడు అభిషేక ప్రియుడు. తన భక్తులు తనను నోరారా నమశ్శివాయ అని పూజిస్తే చాలు... ప్రసన్నుడవుతాడు. నిత్యం ఇంట్లో శివార్చన జరగడం మంచిదే. శివపూజ అందరూ చేయవచ్చు. అయితే బాణలింగం, స్ఫటికలింగం, సాలగ్రామం వంటి వాటికే ఎక్కువ నియమాలు, విధులూ ఉన్నాయి. అవి యోగ్యులైన గురువుల సాయంతోనే స్వీకరించాలి. అవి లేకున్నా వెండి లింగాన్ని అర్చించడం మంచిదే. – బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ♦ప్రశ్నోత్తర భారతం.. లక్క ఇంటి కథ 1. ఎవరు యువరాజు అయ్యారు? 2. పాండవులను చూసిన దుర్యోధనుడు ఏ విధంగా ఉన్నాడు? 3. దుర్యోధనుడు ఏమని ఆలోచన చేశాడు? 4. తన దురాలోచన గురించి ఎవరెవరిని సంప్రదించాడు? 5. శకుని ముఖ్యమంత్రి ఎవరు? 6. కణికుడు ఏం చేస్తాడు? – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ జవాబులు: 1. ధర్మరాజు యువరాజు అయ్యాడు. సార్వభౌముని గౌరవం పొందాడు. పాండవులు పరాక్రమవంతులు అయ్యారు. 2. దుర్యోధనుడు సహించలేకపోయాడు. అతనిలో అశాంతి ప్రవేశించింది. నిదుర పట్టలేదు. 3. పాండవులను హతమార్చాలనుకున్నాడు. అందుకోసం పన్నాగాలను గురించి ఆలోచించాడు. 4. శకుని. కర్ణుడు మొదలైన వారిని సంప్రదించాడు. 5. కణికుడు 6. దుర్యోధనుడికి రాజకీయ ఉపాయాలను బోధిస్తాడు. ♦అమృత సూక్తులు ►కొంచెం తెలిసి ఉండి కూడా అన్నీ తెలిసినట్లు నటించడం నీచుల లక్షణం ►సంతోషం మంచి నుంచి కలుగుతుంది. చెడు నుంచి కలిగేది పైకి సంతోషంగా అనిపించినను అనంతరం అదిదుఃఖంగానే మారుతుంది. ►ప్రేమ వల్ల కోపాన్ని, మంచి వల్ల చెడును, ధర్మం చేత లోభాన్ని, విచారణ చేత మోహాన్ని, సత్యం చేత అబద్ధాన్నీ జయించాలి. ►సజ్జన సహవాసమే ఎల్లప్పుడూ చేయవలెను. ఒకవేళ సజ్జన సహవాసం లభించని యెడల ఎటువంటి సహవాసమూ చేయకుండుట మేలు. ►స్వల్పమైన ముత్యాల కోసం మనిషి ఎటువంటి కష్టానికైనా ఓర్చి ప్రాణహానికైనా తెగించి ఘోరమైన సముద్రంలో మునిగి వాటిని పొందుతాడు. కాని అనంతమైన, అనల్పమైన భగవదనుగ్రహం కోసం ఏ కష్టాలూ పడనవసరం లేదు. కేవలం భక్తిశ్రద్ధలు, సాటి మనుషుల యెడల ప్రేమ, పరోపకార గుణం కలిగి ఉంటే చాలు. -
మహాత్మగాంధీకి డల్లాస్‌లో ఘన నివాళి
- డాల్లస్‌లో జాతిపితకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఘన నివాళి టెక్సాస్: అమెరికా దేశ సంరక్షణ కోసం అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా వారికి నివాళులు అర్పించారు. ఈ తరుణంలో డాల్లస్‌లో ఉన్న మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద విశ్వశాంతికై కృషి చేసిన జాతి పిత మహాత్మా గాంధీకి.. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ చైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర నివాళులు అర్పించారు. వేదాలు, ఉపనిషత్తులు, భాగవత పురాణం, భగవద్గీత, బ్రహ్మ సూత్రాల్లాంటి అనేక ఆధ్యాత్మిక విషయాలపై వ్యాఖ్యానాత్మక ప్రవచనా పరంపరలతో కోట్లాది హృదయాల్లో భక్తి ప్రపత్తులు నింపిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ మహాత్మాగాంధీకి శ్రద్ధాంజలి ఘటించడానికి విచ్చేయడం సంతోషమని డాక్టర్. ప్రసాద్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ తాను చెప్పిందే స్వయంగా ఆచరించేవారని, తాను ఆచరించిందే చెప్పేవారని, అను నిత్యం సమాజ శ్రేయస్సే శ్వాసగా తన జీవితాన్ని అంకితం చేశారని డాక్టర్. తోటకూర అన్నారు. కేవలం సనాతన ధర్మ విలువలను, వైశిష్ట్యాలను చాటి చెప్పడం, ఆధ్యాత్మిక ప్రభోధనలే గాక, ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం, వివిధ భారతీయ కళలలో నిష్ణాతులైన వారికి పురస్కారాలు అందజేయడం, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, గో సంరక్షణా బాధ్యతలు చేపట్టడం అనే విషయాలే ధ్యేయంగా ఋషి పీఠం అనే ధార్మిక సంస్థ ద్వారా సామాజిక సేవ చేస్తున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి కృషి అభినందనీయమని డాక్టర్. ప్రసాద్ తోటకూర కొనియాడారు. డాక్టర్.సామవేదం షణ్ముఖ శర్మ గారు మాట్లాడుతూ.. డాల్లస్ నగరంలో ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి విశ్వశాంతికై శ్రమపడిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ప్రధాన పాత్ర వహించిన చైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కాల్వల కృషి ప్రశంసనీయమని అన్నారు. “గాంధీ సిద్ధాంతాలలో ప్రముఖమైనవి సామరస్యం, శాంతి, భిన్నత్వంలో ఏకత్వం. భగవద్గీత లాంటి సనాతన ధర్మాలలో కూడా ఇవే ఉన్నాయి. ఇక్కడి విగ్రహ విశేషం ఏమిటంటే గాంధీ చేతిలో భగవద్గీత ఉండటం. భారతదేశపు హృదయమే భగవద్గీత, దాన్ని తన చేతిలో పట్టుకొని చేతలో చూపించారు. గాంధీ స్వచ్ఛ భారతానికై కలలు గన్నారని, ప్రజల్లో శుభ్రత పట్ల ఒక అవగాహన కలిగించడానికి తానే స్వయంగా పారిశుధ్య కార్యక్రమాలు చేసేవారని, ఇప్పుడు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే బాటలో పయనించడం విశేషo. మహాత్మాగాంధీ గో సంరక్షణ జరగాలని, గో సంరక్షణ అనేది ఒక మతానికి సంబంధించినది కాదని, అది భారతీయతకు సంబంధించినదని, స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి సంతకం గోవధ నిషేధంపై జరగాలని ఆశించారు' అని అన్నారు. ప్రస్తుత గోవధ నిషేధ ఆశయ సాధనలో ప్రభుత్వం అడుగులు వేయడం సంతోషదాయకమని ఆనందం వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ అన్ని మతాలను సమంగా గౌరవించాలి గాని మత మార్పిడులను ప్రోత్సహించకూడదని స్పష్టంగా చెప్పారని అన్నారు. గాంధీ విశ్వ మానవుడని, ఆయన చెప్పిన ప్రతి మాట మనం అమలుపరుచుకోగల్గితే, భారతదేశం ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలుస్తుందని అన్నారు. విశ్వశాంతికై పాటు పడిన మహనీయుడు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎన్నో తీరిక లేని కార్యక్రమాలతో బిజీగా ఉండి కూడా మహాత్మాగాంధీకి నివాళులు అర్పించడానికి విచ్చేసిన డాక్టర్. బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మకు కృతజ్ఞతలు తెలుపుతూ అయన ఇచ్చిన సందేశం అమూల్యమైనదని, అలాగే ప్రవాస భారతీయులుగా మేము చేస్తున్న సామజిక సేవను ఆయన ప్రశంసించడం తమకు నూతనోత్తేజాన్ని కలిగిస్తుందని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల వందన సమర్పణలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి పట్టిసం, లక్ష్మి గుంటూరి, శర్మ గుంటూరి, సాంబు మంథా, డాక్టర్. నరసింహారావు వేముల, ఎంవిఎల్ ప్రసాద్, కర్రా వెంకట్రావు, వెంకట్ ములుకుట్ల తదితరులు పాల్గొని జాతిపితకు నివాళులు అర్పించారు.