
అవిర్భవ్
తుమ్ ముజేనా యూ బచానా పావోవే’... రఫీ పాడిన ఈ పాటను ఏడేళ్ల అవిర్భవ్ వేదిక మీద పాడుతుంటే అందరికీ కన్నీరు వచ్చింది. ఇంత బాగా పాడిన ఈ బుడతడిని సోనిలో సూపర్‌స్టార్ సింగర్ సీజన్ 3 (మార్చి 2024 నుంచి ఆగస్టు 2024 వరకు) చూసిన వారెవరూ అంత సులభంగా మర్చిపోలేరు. అందుకే మొత్తం 11 మంది ఫైనలిస్ట్‌లలో తమ ఓటింగ్ ద్వారా అవిర్భవ్‌నే విజేతగా నిలిపారు.
పది లక్షల రూపాయల బహుమతి వచ్చేలా చూశారు. జడ్జిల చాయిస్‌గా అధర్వ బక్షి అనే మరో చిన్నోడు విజేతగా నిలిచినా ఈ సీజన్‌లో సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టింది మాత్రం అవిర్భవే. చిన్నగా కోమలమైన ఆకారంతో ఉన్నప్పటికీ అవిర్భవ్ రేంజ్ చాలా గొప్పది. కేరళకు చెందిన అవిర్భవ్ తన సోదరి అనిర్విన్య దగ్గర రెండేళ్ల వయసు నుంచే సంగీతం నేర్చుకున్నాడు.
తెలుగు షోస్‌లో కూడా పాల్గొన్నాడు. కాని ఇపుడు సూపర్‌స్టార్ సింగర్ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతమయ్యాడు. అర్జిత్ సింగ్ ఇతడి ఫేవరెట్ సింగర్. పెద్దయ్యాక గాయకుణ్ణి అయ్యి సల్మాన్, షారుక్‌ఖాన్‌లకు పాడతానని అంటున్నాడు అవిర్భవ్.
ఇవి చదవండి: ఆమె గొంతుక.. మన గుండెల్లో..!
Comments
Please login to add a commentAdd a comment