బ్రెజిల్: ఆస్పత్రిలో జాయిన్ అవ్వడం అంటేనే చాలా మంది భయపడతారు. ఎంతో బాగోకపోతేనో లేక పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటేనో తప్ప ఎవరు ఆస్పత్రిలో జాయిన్ అవ్వడానికి ఇష్టపడం. అలాంటిది ఇంకా అడుగులు కూడా వేయడం సరిగా రాని ఒక చిన్నారి ఒక వ్యాధితో బాధపడుతూ కూడా తనకు అదేం లేదన్నట్టుగా డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
(చదవండి: "సైక్లోథాన్‌తో మానసిక ఆరోగ్యం పై అవగహన కార్యక్రమాలు")
వివరాల్లోకెళ్లితే...బ్రెజిల్‌కి చెందిన మిగ్యుల్ అనే చిన్నపిల్లాడు గ్యాస్ట్రోఎంటెరిటిస్(అన్నాశయ సమస్య)తో ఆస్సత్రిలో జాయిన్ అయ్యాడు. పైగా అతని ఎడమ చేతికి బ్యాండేజ్ కూడా ఉంది. అయినప్పటికీ అవేమీ తనకు పట్టనట్లుగా ఆస్సత్రిలోని టీవీలో తనకు ఇష్టమైన సాంగ్ రాగానే ఆనందంగా పాడుతూ డ్యాన్స్ చేశాడు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బుడతడు..తన ఫేవరెట్ సాంగ్ వచ్చేసరికి ఊగిపోయాడు.
రాక్‌స్టార్‌ను తలపించేలా డ్యాన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు.పైగా టీవిలో నటుడు ఎలా మైక్ పట్టుకుని పాడుతూ డ్యాన్స్ చేస్తున్నాడో అలా తాను కూడా ఒక ప్లాస్టిక్ స్పూన్‌ని మైక్‌లా పట్టుకుని పాడుతూ డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు 'వావ్' అంటూ మిగ్యుల్‌ని ప్రశంసిస్తున్నారు.
(చదవండి: "కదిలే టాటుల అద్భుతమైన వీడియో")
Comments
Please login to add a commentAdd a comment