
వైరల్
‘చాయ్ హోటల్‌కు ఎందుకు వెళతారు?’ అనే ప్రశ్నకు–‘చాయ్ కోసమే వెళతారు’ అనే జవాబు మాత్రమే వినిపిస్తుంది. అయితే సూరత్‌లోని విజయ్‌భాయి పటేల్ అలియాస్ డాలీ చాయ్‌వాలా అలియాస్ సింగింగ్ చాయ్‌వాలా హోటల్‌కు ‘పాట’ కోసం వెళతారు.
డాలీ చాయ్‌వాలా కస్టమర్‌లకు వేడి వేడి టీ అందిస్తూనే, మైక్రోఫోన్‌లో అద్భుతంగా పాడుతుంటాడు. ఆయన గానం వింటూ ‘మరో చాయ్’ అనే మాట కస్టమర్‌ల నోటి నుంచి వినిపించడం అక్కడ సాధారణ దృశ్యం. ఈ ‘సింగింగ్ చాయ్‌వాలా’కు సంబంధించిన వీడియో క్లిప్‌ను ముంబైలోని సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ బయాని ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేస్తే వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment