జీవితం ఎప్పుడు ఏ మలుపుకు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. మనం చేసే కొన్ని పనులు ఆ క్షణంలో చూసేవారికి తప్పుగా అనిపించినా, కాలమే వారికి సమాధానం చెప్తుంది. ఈ వాఖ్యాలు ఆస్ట్రేలియాలోని ఓ ఆంధ్రా విద్యార్థికి సరిగ్గా సరిపోతాయి. విదేశాలలో ఓ యూనివర్సిటీలో చదివి ఆపై లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో విమానం ఎక్కాడు. కానీ అక్కడకి వెళ్లాక ఏం జరిగిందో గానీ చదువుని మధ్యలోనే పక్కన పెట్టాడు. చివరికి అదే అతని జీవితాన్ని ములుపు తిప్పింది. కేవలం ఏడాది వ్యవధిలోనే మిలియన్ డాలర్ల కంపెనీకి యజమానిగా మార్చేసింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే?
వివరాల్లోకి వెళితే.. అందరిలానే ఎన్నో కలలతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన కొండా సంజిత్ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువు కోసం ఆస్ట్రేలియా విమానం ఎక్కాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నప్పటికీ మధ్యలో అకస్మాత్తుగా అతను తన చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి కాలేజ్ డ్రాప్ అవుట్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతను ఉంటున్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరం కాఫీకి ప్రసిద్ధి.
చిన్నప్పటి తనకీ కూడా టీ అంటే మక్కువ ఎక్కువ. ఈ రెంటిని జత కలుపుతూ ఒక ఐడియా అతని మెదడులో మెదిలింది. అప్పుడే‘డ్రాప్‌అవుట్ చాయ్‌వాలా’కు పునాది పడింది. అయితే మొదట్లో టీ షాపు అనగానే తన తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి లోనైనా, సొంత వ్యాపారం పెడుతున్నానని వారికి నచ్చజెప్పాడు. తన సంకల్పానికి తోడుగా అస్రార్ అనే ఒక ఎన్‌ఆర్‌ఐ తన ప్రాజెక్టుపై నమ్మకం ఉంచి.. ఏంజెల్ ఇన్వెస్టర్‌గా మారడానికి ఒప్పుకున్నారు. అలా ‘డ్రాప్‌అవుట్ చాయ్‌వాలా’ పేరుతో వ్యాపారం మొదలుపెట్టాడు.
అందులో అన్ని రకాల కాఫీలు, టీలు సమోసాలు అందుబాటులో ఉంచాడు. అక్కడి రుచులకు భారతీయులతో పాటు ఆస్ట్రేలియన్లు సైతం ఫిదా అయ్యారు. అక్కడి భారతీయులకు ‘బాంబే కటింగ్’ టీ అంటే ఇష్టపడుతుండగా, ఆస్ట్రేలియన్లు ‘మసాలా చాయ్’, పకోడాలంటే ఆసక్తి చూపుతున్నారు. వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుంది. ఆదాయం పన్నులు పోగా 1 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల ( భారత కరెన్నీ ప్రకారం దాదాపు రూ.5.2 కోట్లు)కు చేరనుంది.
చదవండి: Snapchat కొత్త ఫీచర్: వారికి గుడ్ న్యూస్, నెలకు రూ. 2 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment