drop out
-
నెలకు రూ. 35 లక్షలేంటి బ్రో! దిగ్గజాల షాకింగ్ రియాక్షన్
బిట్స్ పిలానీ డ్రాప్‌అవుట్, 20యేళ్ల యూట్యూబర్ ఇషాన్ శర్మ సంపాదన బిజినెస్ దిగ్గజాలను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది 2024లో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ‘లీక్డ్’ పేరుతో నిర్వహించిన పోడ్కాస్ట్లో ఇషాన్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచకున్నారు. దీనికి సంబంధించిన చిన్న క్లిప్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది.విషయం ఏమిటంటే 2024లో వ్యాపారం ఎలా ప్రారంభించాలి అనే అంశంపై భారత్‌పే ఫౌండర్ అష్నీర్ గ్రోవర్, ఆఫ్‌బిజినెస్ సహ వ్యవస్థాపకుడు సీఈవో, ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్ కో ఫౌండర్ ఆసిష్ మోహపాత్ర, సార్థక్ అహుజా, ఇంకా నౌకరీ డాట్‌కాంకు చెందిన ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందానీలతో షార్క్ ట్యాంక్ సీజన్1 పోడ్కాస్ట్లో భాగంగా ముచ్చటించాడు. ఈసందర్భంగా తాను గత నెలలో రూ. 35 లక్షలు సంపాదించానని, తాను వ్యాపారంలోకి ఇదే పెద్ద సమస్యగా మారిందంటూ వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోను కావడం అష్నీర్ గ్రోవర్ వంతైంది. ఈ వయస్సులో అద్భుతం ప్రశంసనీయం అటూ ఇషాన్శర్మపై పొగడ్తలు కురిపించాడు. "నెలకు రూ. 35 లక్షలు సంపాదిస్తావా? అంటూ ఆశ్చర్యపోయాడు. అందేకాదు ‘బాబూ నువ్వు ఇక్కడ కూచోవాలి, అక్కడ కాదు (ఇంటర్వ్యూ చేసే ప్లేస్)’’ అంటూ చమత్కరించాడు. అటు నెటిజన్లుపై అతనిపై ప్రశంసలు కురిపించారు.Shocking Reaction of Ashneer Grover and Sanjeev Bikchandani After Knowing Ishaan Makes Over ₹35 Lakhs a MonthThis is Excellent, Commendable at His Age pic.twitter.com/BCmO60Vgl9— Ravisutanjani (@Ravisutanjani) July 17, 2024 ‘‘ఇది చూసిన కుర్రాళ్లకు తామేమీ సాధించలేదనే ఆందోళన (ఫోమో) పట్టుకుంటుంది. నాకు 23 ఏళ్లు, నయాపైసా సంపాదన లేదు, నాన్న మీదే అధారపడుతున్నా... కానీ ఏదో ఒకరోజు ఇతనికి పోటీగా సంపాదిస్తా అని ఒకరు, ఇది చూసే దాకా నా రోజు చాలా బాగుంది. నెలకు 35 లక్షల రూపాయలు సింపుల్ మనీ అంటాడేంటి భయ్యా అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించాడు. -
స్తోమత లేక బడి మానేసి బీడీలు.. ఇప్పుడు అమెరికాలో జడ్జీగా తీర్పులు
తిరువనంతపురం: కష్టాలు వచ్చాయని ఆయన కుంగిపోలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో 10వ తరగతితోనే చదువు ఆపేశారు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు బీడీలు చుట్టారు. ఇళ్లల్లో పని మనిషిగానూ చేశారు. కట్ చేస్తే ప్రస్తుతం అమెరికాలో జడ్జీగా నియమితులై తీర్పులు చెబుతోంది. ఆయనే కేరళలోని కాసరగోడ్ ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల సురేంద్రన్ కే పటేల్. ఇటీవలే అమెరికాలోని టెక్సాస్‌లో జిల్లా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తాను గతంలో బీడీలు చుట్టడం, పని మనిషిగా చేయటమే తన విజయానికి కారణమయ్యాయని చెప్పుకొచ్చారు సురేంద్రన్. ‘పైచదువులు చదివించే స్తోమత నా కుటుంబానికి లేకపోవడంతో 10వ తరగతి తర్వాత చదువు మానేశాను. రోజువారీ కూలీగా ఏడాది పాటు బీడీలు చుట్టాను. అదే జీవితంపై నా దృక్పథాన్ని మార్చేసింది.’అని పేర్కొన్నారు సురేంద్రన్ కే పటేల్. తన జీవితాన్ని మార్చుకునేందుకు చదువుకోవాలని నిర్ణయించుకున్నాని, అందుకోసం గ్రామంలోని తన స్నేహితులను సాయం చేయాలని కోరినట్లు గుర్తు చేసుకున్నారు. లా డిగ్రీ వరకు తనకు స్నేహితులు ఎంతగానో సాయపడినట్లు చెప్పారు. చదువుకునే రోజుల్లో ఓ హోటల్లో హౌస్‌కీపింగ్ జాబ్ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఎల్ఎల్బీ పూర్తి చేసిన తర్వాత చేసిన ప్రాక్టీస్ అమెరికాలో నిలదొక్కుకునేందుకు సాయపడిందన్నారు. అమెరికాలోనూ తన జర్నీ అంత సాఫీగా సాగలేదని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకున్నారు సురేంద్రన్. ‘టెక్సాస్‌లో ఈ స్థాయికి రావడానికి చేసిన ప్రయత్నంలో నా మాటతీరుపై కామెంట్లు చేశారు. నాకు వ్యతిరేకంగా ప్రచారాలు చేశారు. నేను డెమోక్రటిక్ ప్రైమరీకి పోటీ చేసినప్పుడు నేను గెలవగలనని నా సొంత పార్టీ అనుకోలేదు. ఈ స్థాయికి వస్తానని ఎవరూ నమ్మలేదు. కానీ, నేను ఇక్కడ ఉన్నాను. అందరికి ఒకే ఒక్క సందేశం ఇవ్వాలనుకుంటున్నా. నీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఎవరికీ ఇవ్వకు. ఆ నిర్ణయం నీ ఒక్కడిదే. ’ అని తెలిపారు సురేంద్రన్ -
విదేశాలలో చదువు మానేసి.. కాఫీలు, టీలు అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న తెలుగోడు!
జీవితం ఎప్పుడు ఏ మలుపుకు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. మనం చేసే కొన్ని పనులు ఆ క్షణంలో చూసేవారికి తప్పుగా అనిపించినా, కాలమే వారికి సమాధానం చెప్తుంది. ఈ వాఖ్యాలు ఆస్ట్రేలియాలోని ఓ ఆంధ్రా విద్యార్థికి సరిగ్గా సరిపోతాయి. విదేశాలలో ఓ యూనివర్సిటీలో చదివి ఆపై లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో విమానం ఎక్కాడు. కానీ అక్కడకి వెళ్లాక ఏం జరిగిందో గానీ చదువుని మధ్యలోనే పక్కన పెట్టాడు. చివరికి అదే అతని జీవితాన్ని ములుపు తిప్పింది. కేవలం ఏడాది వ్యవధిలోనే మిలియన్ డాలర్ల కంపెనీకి యజమానిగా మార్చేసింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే? వివరాల్లోకి వెళితే.. అందరిలానే ఎన్నో కలలతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన కొండా సంజిత్ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువు కోసం ఆస్ట్రేలియా విమానం ఎక్కాడు. మొదట్లో అంతా బాగానే ఉన్నప్పటికీ మధ్యలో అకస్మాత్తుగా అతను తన చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి కాలేజ్ డ్రాప్ అవుట్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతను ఉంటున్న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం కాఫీకి ప్రసిద్ధి. చిన్నప్పటి తనకీ కూడా టీ అంటే మక్కువ ఎక్కువ. ఈ రెంటిని జత కలుపుతూ ఒక ఐడియా అతని మెదడులో మెదిలింది. అప్పుడే‘డ్రాప్‌అవుట్ చాయ్‌వాలా’కు పునాది పడింది. అయితే మొదట్లో టీ షాపు అనగానే తన తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి లోనైనా, సొంత వ్యాపారం పెడుతున్నానని వారికి నచ్చజెప్పాడు. తన సంకల్పానికి తోడుగా అస్రార్ అనే ఒక ఎన్ఆర్ఐ తన ప్రాజెక్టుపై నమ్మకం ఉంచి.. ఏంజెల్ ఇన్వెస్టర్‌గా మారడానికి ఒప్పుకున్నారు. అలా ‘డ్రాప్‌అవుట్ చాయ్‌వాలా’ పేరుతో వ్యాపారం మొదలుపెట్టాడు. అందులో అన్ని రకాల కాఫీలు, టీలు సమోసాలు అందుబాటులో ఉంచాడు. అక్కడి రుచులకు భారతీయులతో పాటు ఆస్ట్రేలియన్లు సైతం ఫిదా అయ్యారు. అక్కడి భారతీయులకు ‘బాంబే కటింగ్’ టీ అంటే ఇష్టపడుతుండగా, ఆస్ట్రేలియన్లు ‘మసాలా చాయ్’, పకోడాలంటే ఆసక్తి చూపుతున్నారు. వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుంది. ఆదాయం పన్నులు పోగా 1 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల ( భారత కరెన్నీ ప్రకారం దాదాపు రూ.5.2 కోట్లు)కు చేరనుంది. చదవండి: Snapchat కొత్త ఫీచర్: వారికి గుడ్ న్యూస్, నెలకు రూ. 2 లక్షలు -
అక్షరం.. ఆమడదూరం
సాక్షి, మహబూబ్‌నగర్: కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్యను అందిస్తామని చెబుతున్న ప్రభుత్వాలు ఆచరణంలో మాత్రం విఫలమవుతున్నాయి. విద్యాభివృద్ధికి జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఆశించిన అక్షరాస్యత మాత్రం పెరగడం లేదు. గత రెండేళ్లలో జిల్లాలో బడిమానేసిన పిల్లల సంఖ్యను చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. డ్రాపౌట్స్లో మహబూబ్‌నగర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉండగా, జిల్లాలో గట్టు మండలం మొదటిస్థానం దక్కించుకున్నట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా ఉంది. కారణం ఏదైనా ఏటా జిల్లాలో దాదాపు 53.21శాతం మంది విద్యార్థులు మధ్యలోనే బడి మానేస్తున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇటీవల రాష్ట్రవిద్యాశాఖ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాలమూరు గణాంకాలు వెలుగుచూశాయి. జిల్లాలో డ్రాపౌట్స్ సంఖ్యచూసి రాష్ట్రప్రభుత్వం చూసి నివ్వెరపోయింది. 2011-12 విద్యాసంవత్సరంలో 12,126 మంది బడి మానేసిన వారుంటే అందులో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులే ఉన్నారు. ఎస్సీలు 2,455 మంది విద్యార్థులు ఉండగా ఎస్టీలు 2,068 మంది ఉన్నారు. ఇక 2012-13 విద్యాసంవత్సరంలో కూడా ఇవే ఫలితాలు ఎదురయ్యాయి. బడిమానేసిన వారిలో 2,059మంది ఎస్సీ విద్యార్థులు ఉండగా, ఎస్టీలు 1,605 మంది ఉన్నారు. కదిలిన యంత్రాంగం బడుగు, బలహీనవర్గాల పిల్లలే చదువుకు దూరం కావడం పట్ల ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, విద్యాశాఖ దిద్దుబాటుకు ఉపక్రమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ‘బడిపండుగ’ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పిల్లలను స్కూళ్లకు పంపితే మధ్యాహ్న భోజనంతో పాటు దుస్తులు కూడా ఉచితంగా అందజేస్తామని ప్రచారం చేపట్టింది. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రుల్లో మార్పు వస్తేనే ఫలితం ఉంటుదనే ఆలోచనతో జిల్లా విద్యాశాఖ ఆదిశగా కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం గ్రామాల్లోని యువత, డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీల ద్వారా ప్రచారాన్ని చేపట్టింది. తద్వారా ఈ ఏడాది ఇప్పటి దాకా 4,372 మంది బడిమానేసిన పిల్లలను తిరిగి చేర్పించగలిగారు. అయితే బడిలో చేరిన వారి కంటే ఇంకా బడిబయట ఉన్న వారి సంఖ్య 5,019 మంది ఉండటం గమనార్హం. గట్టు.. ఫస్ట్ గట్టు మండలంలో రాష్ట్రంలోనే అతితక్కువ అక్షరాస్యత శాతం 30 మాత్రమే నమోదైంది. ఇప్పటికీ 800 విద్యార్థులు బడిబయటే ఉన్నారు. వలసలు ప్రధానంగా ఉండే ఈ మండలంలో ఎక్కువమంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపడం లేదు. రాయిపురం, పెంచికలపాడు తదితర గ్రామాల్లో బాలికల అక్షరాస్యత శాతం జీరోగా ఉంది. 15 ఏళ్లలోపే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. అలాగే కర్ణాటక సరిహద్దులో ఉన్న నందిన్నె, చింతలకుంట గ్రామాల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారు. వయోజనుల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు అమలుచేసిన గట్టు విద్యాజ్యోతి కార్యక్రమం మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. బడిబాట కార్యక్రమం కూడా సత్ఫలితాలను ఇవ్వలేకపోతోంది. -
డ్రాపవుట్స్‌పై సర్కారు దృష్టి!
* బడి మానేస్తున్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ * కేజీ టు పీజీ పథకంలో అధిక ప్రాధాన్యం సాక్షి, హైదరాబాద్: మధ్యలోనే బడి మానేస్తున్న పిల్లల(డ్రాపవుట్స్) విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. కేజీ నుంచి పీజీ పథకం అమలులో భాగంగా ఈ డ్రాపవుట్స్ తగ్గింపునకు ప్రాధాన్యమిచ్చే దిశగా కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలోనే డ్రాపవుట్ రేట్ ఎక్కువగా ఉంది. అందులోనూ ఎస్సీ, ఎస్టీల్లోనే ఈ సంఖ్య అధికంగా ఉంటోంది. అలాంటి వారిని స్కూళ్లకు రప్పించేందుకు కేజీ-పీజీ పథకంలో ప్రాధాన్యమిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఓ కార్యాచరణను రూపొందించనుంది. దీనిపై త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్లు తెలిసింది. ప్రైవేట్ స్కూళ్లకు పంపించలేక, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కుదరక తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు దూరం చేస్తున్నారని సర్కారు భావిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం... ప్రాథమిక పాఠశాల(ఒకటో తరగతిలో చేరిన వారు ఐదో తరగతికి వచ్చే సరికి) స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో బడి మానేస్తున్న వారు 22.32 శాతం ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఇది 3.20 శాతం మాత్రమే ఉంది. ఇక ఒకటో తరగతిలో చేరిన వారు 8వ తరగతికి వచ్చే సరికి తెలంగాణలో 32.56 శాతం మంది విద్యార్థులు బడి మానేస్తుంటే.. ఏపీలో 19.16 శాతం మంది బడికి దూరమవుతున్నారు. ఇక ఒకటో తరగతిలో చేరిన వారు పదో తరగతికి వచ్చే సరికి తెలంగాణ జిల్లాల్లో డ్రాపవుట్ రేటు 38.21 శాతంగా ఉండగా, ఏపీలో మానేస్తున్న వారు 26.83 శాతమే. మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా 53.21 శాతం మంది విద్యార్థులు మధ్యలోనే బడి మానేస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇక తెలంగాణలోని ఎస్సీల్లో 40.32 శాతం, ఎస్టీల్లో 62.81 శాతం డ్రాపవుట్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే ఎస్సీల్లో 34.99 శాతం, ఎస్టీల్లో 60.37 శాతం డ్రాపవుట్స్ రేటు నమోదైంది. -
డ్రాపౌట్స్... 237
సాక్షి, కడప : జిల్లాలో వేల సంఖ్యలో డ్రాపౌట్స్(బడిబయటిపిల్లలు) ఉన్నా అధికారుల లెక్కలు చూస్తే ఆశ్చర్య పోవలసిందే. డ్రాపౌట్స్ విషయంలో రాజీవ్ విద్యామిషన్ అధికారులు కాకి లెక్కలు చెబుతూ మభ్య పెడుతూనే ఉన్నారు. సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కడపలో కేవలం నలుగురు బాలురు మాత్రమే ఉన్నట్లు ఆర్వీఎం జాబితా చెబుతోంది. ప్రొద్దుటూరులో అసలు బాలురే లేరని పేర్కొంటున్నారు. నలుగురు బాలికలు మాత్రమే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మైదుకూరులో ఓ డ్రాపౌట్ కూడా లేరని తేల్చారు. తప్పుడు నివేదికలు జిల్లాలో 3026 మంది బడి బయట పిల్లలు ఉన్నట్లు గత ఏడాది ఆర్వీఎం అధికారుల సర్వేలో తేలింది. వీరిలో 974 మందిని వివిధ పాఠశాలల్లో, 962 మందిని కస్తూర్బా పాఠశాలల్లో చేర్చినట్లు లెక్కలు చెబుతున్నారు. విద్యా పక్షోత్సవాలు, బడిబాట, సీఆర్పీల ద్వారా మిగిలిన పిల్లలను బడిలో చేర్చగా, కేవలం 237 మంది మాత్రమే మిగిలారని లెక్క తేల్చారు. ఈ మేరకు నివేదికలు తయారుచేసి ఉన్నతాధికారులకు పంపారు. ఆర్‌ఎస్‌టీసీలకు మంగళం 2011-12 సంవత్సరంలో ఎన్జీఓల ఆధ్వర్యంలో 61 ఆర్‌ఎస్‌టీసీలను నడిపారు. 2012-13లో వీటి సంఖ్య 13కు కుదించారు. జిల్లాలో కేవలం 237 మంది డ్రాపౌట్స్ ఉన్నందున వీరికోసం ఐదు ఆర్‌ఎస్‌టీసీలు మాత్రమే నడపాలని ఆర్వీఎం అధికారులు తొలుత నిర్ణయించారు. అయితే ఈ డ్రాపౌట్స్ జాబితాను చూసి ఎన్జీఓలతోపాటు పలువురు అవాక్కయ్యారు. జిల్లాలో మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థులను ఎలా తేవాలో అర్థంగాక ఆర్‌ఎస్‌టీసీలను నడపలేమంటూ చేతులు ఎత్తేశారు. దీంతో 2013-14కు సంబంధించి జిల్లాలో ఆర్ఎస్టీసీలే లేకుండా పోయాయి. జిల్లాలో వందలాది మంది బడి బయట పిల్లలు ఉన్నారని తమకు ఆర్‌ఎస్‌టీసీలు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆర్వీఎం అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారని ఎన్జీఓలు సైతం పెదవి విరుస్తున్నారు. ఒక్క కడప నగరంలోనే వెయ్యి మందికి పైగా డ్రాపౌట్స్ ఉంటారని, అయితే నలుగురు మాత్రమే ఉన్నారని లెక్కలు చెప్పడం విచిత్రంగా ఉందని పేర్కొంటున్నారు. ఆర్వీఎం అధికారులు శాస్త్రీయంగా సర్వే చేసి బడిబయట పిల్లలకు న్యాయం చేసి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేస్తున్నాం బడి బయటి పిల్లల కోసం సర్వే చేస్తున్నాం, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో రూరల్ ప్రాంతాల్లో ఎన్జీఓల ఆధ్వర్యంలో సర్వే జరుగుతోంది. సర్వే అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం. - జయసుబ్బారెడ్డి, ఏఎల్ఎస్ కో ఆర్డినేటర్