Meet Audi Chaiwala: Who Sells Tea on His Luxury Car Check the Viral Video - Sakshi
Sakshi News home page

‘ఆడి చాయ్‌వాలా’ ఏమైంది భయ్యా? వైరల్‌ వీడియో

Apr 11 2023 8:07 PM | Updated on Apr 11 2023 8:28 PM

Meet Audi Chaiwala Who Sells Tea On His Luxury Car check viral video - Sakshi

సాక్షి, ముంబై: మనం ఇప్పటివరకు టీ అమ్ముతూ రూ.4 కోట్ల టర్నోవర్ సాధించిన ఎంబీయే చాయ్‌వాలా, బీటెక్‌ అమ్మాయి..బుల్లెట్‌ బండిపై పానీ పూరీ అమ్మిన స్టోరీలు చదివాం కదా. తాజాగా 'ఆడి చాయ్‌వాలా' హాట్‌టాపిక్‌గా నిలిచాడు.విలాసవంతమైన కారులో రోడ్డు పక్కన టీ అమ్ముతున్న వ్యక్తికి చెందిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఆశిష్ త్రివేది అనే యూజర్‌ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోలో లగ్జరీ వైట్‌  ఆడి కారులో టీ అమ్ముతున్న వ్యక్తిని  చూడవచ్చు.కస్టమర్ల దృష్టిని ఆకర్షించడానికి ఇదో స్మార్ట్‌ పద్ధతి అనుకున్నాడో ఏమోకానీ ఖరీదైన కారులో టీ అమ్మడం విశేషంగా మారింది. అయితే ఆడి చాయ్‌వాలా ఇన్వెంటివ్ మార్కెటింగ్ వ్యూహం అంటూ యూజర్ల కమెంట్‌ చేశారు. ఇంకొంత మంది ఈఎంఐ కవర్ చేయడానికి టీ విక్రయిస్తున్నాడని ఒకరు, టీ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో మెర్సిడెస్-బెంజ్ జీ వాగన్‌ను కొనాలకి  ఇంకొకరు, టీ అమ్మి ఆడి  కారును కొనుగోలు చేశారా? లేక ఆడి కారు కొన్నాక టీ అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందా అని మరికొందరు, చాయ్‌  అమ్మి దేశ ప్రధానమంత్రి అయిపోవాలనుకుంటున్నాడు  అంటూ వ్యాఖ్యానించడం  విశేషం.  ఈ వీడియోకు ఇప్పటివరకు సోషల్ మీడియాలో మిలియన్ల  వ్యూస్‌, 3,లక్షల 72 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement