డాలీ చాయ్‌వాలాతో బిల్‌ గేట్స్‌: ఏఐ వీడియోనా? ఇంటర్నెట్‌ ఫిదా | Bill Gates Meetup With Dolly Chaiwala From Nagpur Breaks The Internet, See Netizens Reactions Goes Viral - Sakshi
Sakshi News home page

Bill Gates-Dolly Chaiwala Viral Video: డాలీ చాయ్‌వాలాతో బిల్‌ గేట్స్‌: ఏఐ వీడియోనా? ఇంటర్నెట్‌ ఫిదా

Published Thu, Feb 29 2024 12:59 PM | Last Updated on Thu, Feb 29 2024 1:33 PM

Bill Gates meetup with Dolly Chaiwala from Nagpur breaks the Internet - Sakshi

‘వన్ చాయ్ ప్లీజ్’..డాలీ చాయ్ వాలాతో  కుబేరుడు బిల్‌గేట్స్  మీట్‌

సోషల్‌ మీడియాలో బిల్‌ గేట్స్‌ వీడియో  వైరల్

మైక్రోసాఫ్ట్‌ సంస్థ అధినేత బిల్‌గేట్స్‌ భారత పర్యటనలో మరోసారి తన స్పెషాల్టీని  చాటుకున్నారు. భారత దేశ ఆవిష్కరణలపై ఎప్పటిలాగానే ప్రశంసలు కురిపించారు. పాపులర్‌ నాగ్‌‌పూర్ డాలీ చాయ్ వాలా టీ స్టాల్‌ను సందర్శించిన ఆయన ఇక్కడి టీకి ఫాదా అయిపోయారు.  దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సోషల్‌ మీడియాలో  బాగా ఫేమస్ అయిన డాలీ చాయ్‌ వాలా ‘వన్ చాయ్ ప్లీజ్’ అంటూ బిల్‌గేట్స్ టీ అడిగి మరీ తాగారు.  అంతే చాయ్‌వాలా టీకి  బిల్‌ గేట్స్‌ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో  ‘‘ఇండియాలో ఎక్కడికెళ్లినా  అక్కడ ఆవిష్కరణలను కనుగొనవచ్చు- సాధారణ కప్పు టీ తయారీలో కూడా!​‍​‍’’ అంటూ ఒక వీడియోషేర్‌ చేశారు.  బిల్‌గేట్స్‌ సింప్లిసిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇది ఏఐ సృష్టి కాదు కదా అని ఒక యూజర్‌, "ఇది డీప్‌ఫేకా’’ అని కూడా ఒక వినియోగదారు ఆశ్చర్యపోవడం విశేషం.

దీనికి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు కూడా సరదాగా కమెంట్‌ చేశాయి. జొమాటో బిల్‌ గేట్స్‌కి స్పెషల్‌ ఆఫర్‌ కూడా ఇచ్చేసింది. అలాగే బిల్‌ ఎంత స్విగ్గీ  స్పందించింది. నాగ్‌పూర్‌లో వెరైటీ, స్టయిలిష్‌ టీతో డాలీ చాయ్‌వాలా బాగా ఫ్యామస్‌. 10వేల మందికి పైగా ఫాలోవర్లున్నారంటేఈ చాయ్‌వాలా స్పెషల్‌ ఎంటో అర్థం చేసుకోవచ్చు.

కాగా బిల్‌ గేట్స్‌ తన పర్యటనలో భాగంగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఇండియా డెవలప్మెంట్‌ సెంటర్‌ను  కూడా సందర్శించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement