
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు కన్నుమూసిన విషయం తెలిసిందే. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సిరివెన్నెల మృతిపూ సినీ సాహిత్య అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: సిరివెన్నెలకు దురదృష్టం.. తెలుగు వారికి అదృష్టం..త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్
అయితే సిరివెన్నెల చివరిసారిగా పాడిన ఓ స్ఫూర్తి గీతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అనే పాటను ఆయన స్వయంగా ఆలపించారు. సుమన్ హీరోగా నటించిన ‘పట్టుదల’ అనే సినిమాలోని ఈ గీతానికి ‘సిరివెన్నెల’ సాహిత్యం అదించారు. ఆద్యంతం ఈ పాట మనిషి పట్టుదల వీడకూడదు.. సంకల్పం ఉంటే సాధ్యం కానిదేదీ లేదనే స్ఫూర్తిని నింపుతూ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment