మళ్లీ అంటే అలా పాడలేనేమో! | Singing is not my love: Salman Khan | Sakshi
Sakshi News home page

మళ్లీ అంటే అలా పాడలేనేమో!

Published Sun, Sep 6 2015 4:20 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మళ్లీ అంటే అలా పాడలేనేమో! - Sakshi

మళ్లీ అంటే అలా పాడలేనేమో!

న్యూఢిల్లీ: అప్పుడప్పుడు పాటలు పాడటం తనకు సరదా అని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అన్నారు. ఆయన ఇప్పటి వరకు పాడిన పాటలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మీరు పాడిన పాటలు ఇంతగా హిట్ అవుతున్నాయి పాడటాన్ని సీరియస్గానే తీసుకుంటున్నట్లున్నారా అని ఆయనను ప్రశ్నించగా అదేం లేదని చెప్పారు. తాను పాటలు పాడటాన్ని అస్సలు సీరియస్ తీసుకోనని, సరదాకే పాడుతుంటానని చెప్పారు.

ఒక వేళగతంలో నేను పాడిన పాటల్ని ఇప్పుడు మీరు పాడమంటే అలాంటి గొంతుతోటి మళ్లీ పాడలేనని చెప్పారు. స్టూడియోలో ఉన్నప్పుడు అది సాధ్యమవుతుందేమోనని అనిపిస్తుందని చెప్పారు. కిక్ సినిమాకోసం హ్యాంగోవర్, హల్లో బ్రదర్ కోసం చాంది కి దాల్ పార్, ఆయన నిర్మిస్తున్న చిత్రం హీరోకోసం ఓ పాటను సల్మాన్ పాడిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement