పాడేరు సబ్ కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేష్ | PADERU sub-collector Prasanna Venkatesh | Sakshi
Sakshi News home page

పాడేరు సబ్ కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేష్

Published Thu, Sep 4 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

పాడేరు సబ్ కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేష్

పాడేరు సబ్ కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేష్

పాడేరురూరల్: పాడేరు సబ్ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి వి. ప్రసన్న వెంకటేష్‌ను నియమి స్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పాడేరు ఆర్డీఓగా పనిచేస్తున్న జి.రాజకుమారికి బదిలీ అయ్యింది. రాజకుమారి పాడేరు ఆర్డీఓగా 2014, ఫిబ్రవరి 14న విధులలో చేరారు. పాడేరు సబ్ కలెక్టర్‌గా తొలి పోస్టింగ్‌పై వస్తున్న తమిళనాడు కేడర్‌కు చెందిన ప్రసన్న వెంకటేష్ కడపలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు.

రెండేళ్ల క్రితం ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆయన అయిదు నెలల్లోనే బదిలీ అయ్యారు. తరువాత గణపతిరావు ఏడాదిపా టు పాడేరు ఆర్డీఓగా సేవలందించారు. గణపతిరావు బదిలీ అయిన తరువాత జి.రాజకుమారి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల తరువాత పాడేరు సబ్ కలెక్టర్‌గా ఐఏఎస్ స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించింది.
 
రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా విజయరామరాజు  రాజమండ్రి :  రాజమండ్రి డివిజన్ సబ్ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి వి.విజయరామరాజును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈయనది విశాఖపట్నంలోని సీతమ్మధార.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement