ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది...అన్నట్లు సంగీతకారుల కుటుంబంలో జన్మించిన కేతకి మతేంగోకర్‌కు చిన్నప్పటి నుంచే పాట అంటే ఇష్టం. తండ్రి ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. తల్లి సువర్ణ సింగర్. నటిగా కూడా మెప్పించింది కేతకి. ‘షాల’ ఆమె డెబ్యూ ఫిల్మ్. ఈ సినిమా కోసం అవకాశం తనను వెదుక్కుంటూ వచ్చింది. దర్శకుడు సుజిత్ ఒక టెలివిజన్ మ్యూజిక్ షోలో కేతకిని చూసి తన సినిమాలోని పాత్రకు ఎంపిక చేశాడు. నటనలో మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ ‘నటన’ కంటే సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటోంది కేతకి. రోజుకు నాలుగు గంటల పాటు సంగీత సాధన చేస్తుంది.
‘మహేష్ మంజ్రేకర్ సినిమాలో నటించిన తరువాత ఎన్నో అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినా సంగీతానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మంచి సింగర్‌గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. క్లాసిక్ నుంచి కాంటెంపరరీ మ్యూజిక్ వరకు నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను’. గత సంవత్సరం ‘మాయి’ ఆల్బమ్‌తో మ్యూజిక్ కంపోజర్‌గా కూడా తన ప్రతిభ చాటుకుంది కేతకి.
ఈ ఆల్బమ్‌లోని తొమ్మిది పాటలను శంకర్ మహాదేవన్, మహాలక్ష్మీ అయ్యర్‌లాంటి ప్రసిద్ధ గాయకులు పాడారు. ‘మన దగ్గర ఉమెన్ మ్యూజిక్ కంపోజర్‌లు తక్కువగా ఉన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మంచి మ్యూజిక్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారు. చాలామందికి మ్యూజిక్ కంపోజిషన్‌లో అద్భుత ప్రతిభ ఉన్నా ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల దూరంగా ఉంటున్నారు’ అంటుంది కేతకి.
Comments
Please login to add a commentAdd a comment