Shocking Video: Snake Bites Singer On Her Face During Shoot - Sakshi
Sakshi News home page

Shocking Viral Video: పాములతో మ్యూజిక్‌ షూట్‌... షాకింగ్‌ వీడియో!

Published Sun, Dec 26 2021 5:18 PM | Last Updated on Sun, Dec 26 2021 6:53 PM

Shocking Viral Video: Snake Bit Singer Maetas Face  - Sakshi

ఇటీవలకాలంలో పాములకు సంబంధించి వీడియోలు సోషల్‌ మాధ్యమాల్లో తెగ హల్‌చల్‌ చేశాయి. పాములను ముద్దు పెట్టుకోవడం, రబ్బర్‌ బ్యాండ్‌లా చ్టుటుకున్న వైరల్‌ వీడియోలు చూశాం.  అయితే ఆ పాములు ఏం చేయనంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక గాయని పాముల ఒంటి మీద వేసుకుంటు మ్యూజిక్‌ షూటింగ్‌ చేస్తే ఏమయ్యేందో చూడండి.

(చదవండి: అప్పడు అత్యంత పిన్న వయసు బాడీబిల్డర్‌... ఐతే ఇప్పుడు అతను ఎలా ఉన్నాడంటే!!)

అసలు విషయంలోకెళ్లితే....జే-జెడ్‌ లేబుల్ రోక్ నేషన్‌ సంస్థ  సింగర్ మేతాతో  ఒక మ్యూజిక్‌ వీడియోని షూట్‌ చేసింది. అయితే షూటింగ్‌లో గాయని నేల మీద పడుకుని పాములు మీద వేసుకుంటూ పాట పాడుతుంది. అయితే ఇంతలో ఏమైదో ఏమో గానీ ఒక నల్లపాము అమాంతం ఆమె ముఖం మీదే కాటే వేసింది. దీంతో ఆమె ఒక్కసారిగి బిత్తరపోయి వాటిని పక్కకు నెట్టి అక్కడ నుంచి నిష్క్రమించింది. దీంతో ఆ గాయని ఈ ఘటనకు సంబంధించిన వీడియో తోపాటు "మీ అందరి కోసం మ్యూజిక్‌ వీడియోలు షూటింగ్‌ చూస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా! " అనే క్యాప్షన్‌ జోడించి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

(చదవండి: సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement