
నే పాడితే...!
ఈ మధ్య కాజల్ అగర్వాల్ ‘చక్‌వ్య్రూహ’ అనే కన్నడ చిత్రం కోసం ఓ పాట పాడిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో కాజల్ నటించలేదు. ఇప్పుడు ప్రియమణి కూడా ‘దేవరావనే బుదు గురు’ అనే కన్నడ చిత్రం కోసం పాడారు. ఈ చిత్రంలో ఆమె నటించలేదు. ప్రియమణితో పాట పాడించాలని చిత్రదర్శకుడు ప్రథమ్ అనుకున్నారు. అడగ్గానే ఈ బ్యూటీ ‘సై’ అన్నారట. విశేషమేమిటంటే ప్రియమణి ఈ పాటను మూడు రకాల వేరియేషన్స్‌లో పాడారు. ఆమె అద్భుతంగా పాడిందని దర్శకుడు పేర్కొన్నారు.
ప్రియమణితో పాట పాడించిన విషయం చిత్రబృందానికి తెలియదట. అందుకని, చిత్రకథానాయకుడు అకుల్ బాలాజీకి ఈ పాట వినిపించి, ‘ఇది నీకు బాగా తెలిసినవాళ్లు పాడారు? ఎవరో కనుక్కో’ అని దర్శకుడు అడగాలనుకున్నారట. ప్రియమణి, అకుల్ మంచి స్నేహితులు. దర్శకుడు అతనికి విషయం చెప్పేలోపే ప్రియమణి తాను పాడిన విషయం అకుల్‌కి చెప్పడం జరిగింది. పాట విన్న అకుల్... ప్రియమణి ఇంత బాగా పాడగలదా? అని ఆశ్చర్యపోయారట.