సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఐడిల్‌లో విజేతగా నిలిచిన పవన్‌దీప్ రాజన్, అదే విధంగా తెలుగమ్మాయి షణ్ముక ప్రియతోపాటు మరో ఇద్దరు గాయకులతో హైదరాబాద్‌లో తొలిసారిగా ప్రత్యక్ష సంగత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 11.2, మెటలాయిడ్ ప్రొడక్షన్స్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ సంస్థలు సిద్ధమయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో దాదాపు 18నెలల సుదీర్ఘ విరామం తరువాత ప్రత్యక్ష సంగీత కచేరిలకు ఇదే తొలి వేదిక కానుంది. ఈ సందర్భంగా మెటలోయిడ్ ప్రొడక్షన్ ప్రతినిధి ప్రీతిష్ కోలాటి మాట్లాడుతూ.. ఇది రెండో దశ సంగీత వేదికగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభావంతులైన కళాకారులను ప్రేక్షకుల ముందుకు తీసుకచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
‘ఇందులో భాగంగానే కేరళకు చెందిన తైక్కుడం బ్రిడ్జ్, మసాలా కాఫీ, ఇండియన్ ఐడిల్ షోలో ఫైనలిస్టులను ఈ వేదికపైకి తీసుకొస్తున్నాం. తైక్కుడం బ్రిడ్జ్ కళాకారుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న, ఇండియన్ ఐడల్ విజేత పవన్‌దీప్ రాజన్‌తో సెప్టెంబరు 3న హార్ట్‌కప్‌లో ప్రదర్శన నిర్వహించేందుకు సిద్దమవుతున్నాం. ఈ సిరీస్‌లో దేశంలోని అత్యుత్తమమైన సంగీతకారులతోపాటు గాయకులు పాలుపంచుకొని అబిమానులను ఉర్రూతలుగించనున్నారు.
సెప్టెంబర్ 2 - తైకుద్దం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ (ప్రిజం, గచ్చిబౌలి) వద్ద
సెప్టెంబర్ 3 - ఇండియన్ ఐడల్ పవన్ దీప్ రాజన్ (హార్ట్ కప్ కాఫీ, గచ్చిబౌలి)
సెప్టెంబర్ 23 - మసాలా కాఫీ మ్యూజిక్ బ్యాండ్ (ప్రిజం, గచ్చిబౌలి) వద్ద
అక్టోబర్ 1 - ఇండియన్ ఐడల్ షణ్ముఖ ప్రియ (గ్రీజ్ మంకీ క్లబ్, జూబ్లీహిల్స్)
అక్టోబర్ 2 - చిన్మయి + కాప్రిసియో
అక్టోబర్ 9 - స్టాక్కాటో కాంటెంపోరే క్లాసిక్ బ్యాండ్
అక్టోబర్ 15 - శోభన (రవీంద్ర భారతి) వద్ద
అక్టోబర్ 23 - ఇండియన్ ఐడల్ టాప్ 5 (హార్ట్ కప్ కాఫీ) వద్ద
Comments
Please login to add a commentAdd a comment