Music Program
-
లవ్ స్కానింగ్
ముంబైలోని మహాలక్ష్మీ రేస్‌కోర్స్ ప్రాంతంలో జరిగిన మ్యూజిక్ ప్రోగ్రామ్‌కు హాజరైన ఒక యువకుడి టీ షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. 22 సంవత్సరాల హార్థిక్ టీ షర్ట్ వెనకాల ఐ–క్యాచింగ్ మెసేజ్ ‘ఫర్ సింగిల్ పీపుల్ వోన్లీ’తోపాటు క్యూ ఆర్ కూడా ఉంది. క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే నేరుగా అతడి టిండర్ ప్రొఫైల్లోకి తీసుకువెళుతుంది. హార్థిక్ డిజిటల్ ఫ్లర్టింగ్ అనేది టాకింగ్ పాయింట్ కావడమే కాదు సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
హైదరాబాద్: ఇండియన్ ఐడల్ గాయకులతో సంగీత కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఐడిల్లో విజేతగా నిలిచిన పవన్‌దీప్ రాజన్, అదే విధంగా తెలుగమ్మాయి షణ్ముక ప్రియతోపాటు మరో ఇద్దరు గాయకులతో హైదరాబాద్‌లో తొలిసారిగా ప్రత్యక్ష సంగత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 11.2, మెటలాయిడ్ ప్రొడక్షన్స్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ సంస్థలు సిద్ధమయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో దాదాపు 18నెలల సుదీర్ఘ విరామం తరువాత ప్రత్యక్ష సంగీత కచేరిలకు ఇదే తొలి వేదిక కానుంది. ఈ సందర్భంగా మెటలోయిడ్ ప్రొడక్షన్ ప్రతినిధి ప్రీతిష్ కోలాటి మాట్లాడుతూ.. ఇది రెండో దశ సంగీత వేదికగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభావంతులైన కళాకారులను ప్రేక్షకుల ముందుకు తీసుకచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ‘ఇందులో భాగంగానే కేరళకు చెందిన తైక్కుడం బ్రిడ్జ్, మసాలా కాఫీ, ఇండియన్ ఐడిల్ షోలో ఫైనలిస్టులను ఈ వేదికపైకి తీసుకొస్తున్నాం. తైక్కుడం బ్రిడ్జ్ కళాకారుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న, ఇండియన్ ఐడల్ విజేత పవన్‌దీప్ రాజన్‌తో సెప్టెంబరు 3న హార్ట్‌కప్‌లో ప్రదర్శన నిర్వహించేందుకు సిద్దమవుతున్నాం. ఈ సిరీస్‌లో దేశంలోని అత్యుత్తమమైన సంగీతకారులతోపాటు గాయకులు పాలుపంచుకొని అబిమానులను ఉర్రూతలుగించనున్నారు. సెప్టెంబర్ 2 - తైకుద్దం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ (ప్రిజం, గచ్చిబౌలి) వద్ద సెప్టెంబర్ 3 - ఇండియన్ ఐడల్ పవన్ దీప్ రాజన్ (హార్ట్ కప్ కాఫీ, గచ్చిబౌలి) సెప్టెంబర్ 23 - మసాలా కాఫీ మ్యూజిక్ బ్యాండ్ (ప్రిజం, గచ్చిబౌలి) వద్ద అక్టోబర్ 1 - ఇండియన్ ఐడల్ షణ్ముఖ ప్రియ (గ్రీజ్ మంకీ క్లబ్, జూబ్లీహిల్స్) అక్టోబర్ 2 - చిన్మయి + కాప్రిసియో అక్టోబర్ 9 - స్టాక్కాటో కాంటెంపోరే క్లాసిక్ బ్యాండ్ అక్టోబర్ 15 - శోభన (రవీంద్ర భారతి) వద్ద అక్టోబర్ 23 - ఇండియన్ ఐడల్ టాప్ 5 (హార్ట్ కప్ కాఫీ) వద్ద -
జీ సరిగమప ఫైనల్స్‌లో రానా దగ్గుబాటి,సిథ్ శ్రీరామ్
ప్రాంతీయ భాషల్లో ఔత్సాహిక గాయనీ గాయకులను యువ కళాకారులను వెలుగులోకి తెచ్చే జీ సరిగమప పాటల పోటీలు తుది దశకు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 5గురు యువ గాయనీ గాయకులు ఈ పోటీల్లో టైటిల్ కోసం తలపడనున్నారు. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ పోటీలో తుది పోటీలకు మిగిలిన ఈ 5గురి ప్రతిభా పాటవాలకు జీ తెలుగులో 21న జరుగనున్న పోటీ అద్దం పట్టనుంది. సాయంత్రం 6గంటలకు పోటీ ప్రసారం కానుంది. గత కొన్ని వారాలుగా వీక్షకుల ఆదరణతో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో తుది అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఔత్సాహిక గాయనీ గాయకులు భరత్ రాజ్, ప్రజ్ఞా నయిని, పవన్ కళ్యాణ్,వెంకట చైతన్య, యశస్వి కొండేపూడిలలో ఎవరు టైటిల్ గెలుచుకుంటారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తెలుగు వీక్షకుల ఆదరణ పొందిన ఈ కార్యక్రమం ఫైనల్స్ ని మరింత ఆకర్షణీయంగా అందించనున్నారు. కార్యక్రమం ఆసాంతం టాలీవుడ్ టాలెంట్‌తో కళకళలాడనుంది. ముఖ్యంగా తాజా యువ గాన సంచలనం సిద్ శ్రీరామ్ ప్రత్యేక ఆకర్షణగా హాజరుకానున్నారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి, గాయని సునీత, గాయని కల్పన, గాయకులు బాబా సెహగల్, జోయా హుస్సేన్‌లు సైతం వీక్షకులను ఉర్రూతలూగించనున్నారు. గాయని గీతామాధురి, రమ్య బెహ్రా, కృష్ణ చైతన్య లు మెంటార్స్‌గా వ్యవహరిస్తున్న ఈ పోటీలో సంగీత దర్శకులు కోటి, ఎస్పీ శైలజ, చంద్రబోస్‌లు న్యాయ నిర్ణేతలు. -
అన్నీ తెలుగు పాటలే
బాలికల సంక్షేమం కోసం నిధులు సేకరించేందుకు ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ గాయని చిత్ర పాడబోతున్నారు. ఎలెవెన్ పాయింట్ టు సంస్థ నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని వికేర్ సంస్థ సమర్పిస్తోంది. ఈ కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో జరగనుంది. ఈ సంగీత విభావరిలో శ్రీకృష్ణ, శ్రీనిధి, సోనీ వంటి పలువురు సింగర్స్ పాల్గొంటారు. ఈ సందర్భంగా చిత్ర మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే కొన్ని పాటలు ప్రాక్టీస్ చేశాం. కొన్నిపాటలను శ్రీకృష్ణ, శ్రీనిధి, సాకేత్, సోనీ కూడా పాడతారు. మూడు గంటలపాటు జరిగే ఈ కార్యక్రమంలో అందరికీ పరిచయం ఉన్న మ్యూజిషియన్సే పాల్గొంటారు. అన్నీ తెలుగు పాటలే ఉంటాయి. మంచి కారణం కోసం చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘భారతీయ భాషలు చేసుకున్న పుణ్యమిది. మా చిత్రమ్మగారు మంచి కార్యక్రమం చేయబోతున్నారు’’ అన్నారు శ్రీకృష్ణ. ‘‘చిత్రగారు అసోసియేట్ అయిన కార్యక్రమంలో భాగం కావడం అదృష్టం’’ అన్నారు శ్రీనిధి. సాకేత్, సోనీ మాట్లాడారు. -
ఇసయరాజా @ 75
మేస్ట్రో ఇళయరాజా... ఈ పేరు వినగానే సంగీత ప్రియులు ఆయన సినిమాల్లోని పాటలతో కూని రాగాలు తీస్తుంటారనడంలో సందేహం లేదు. తన పాటలతో అంతలా సంగీత ప్రియులను అలరించారాయన. తనకంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఇళయరాజా పుట్టినరోజు జూన్ 2న. ఈ ఏడాది ఆయన 75ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ)’ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘‘వచ్చే ఏడాది ఫిబ్రవరి 2, 3 తేదీల్లో చెన్నైలో ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నాం. సంగీతం, సినిమా రంగానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఈ వేడుకకు తమిళ చిత్రసీమ మొత్తం తరలిరానుంది. వేలమంది అభిమానులు, సంగీత ప్రేమికుల మధ్య చెన్నైలోని వైఎమ్‌సీఏ మైదానంలో ఈ వేడుక నిర్వహించనున్నాం. రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ (తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ) నుంచి పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ‘ఇసయరాజా 75’ (సంగీతం రాజా) అని పేరు పెట్టాం. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో ఎటువంటి సినిమా షూటింగులు, ప్రమోషన్ కార్యక్రమాలు జరగవు. ఈ వేడుకలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి’’ అని టీఎఫ్‌పీసీ పేర్కొంది. -
అమెరికాలో రాక్‌స్టార్ సంగీత విభావరి
తమిళసినిమా: దక్షిణాదిలో రాక్‌స్టార్‌గా ముద్రవేసుకున్న సంగీతదర్శకుడు దేవీశ్రీప్రసాద్. ఈయన మెలోడీ బాణీలు శ్రోతల మనసుల్ని ఉల్లాస పరుస్తాయి. ఫాస్ట్ బీట్ సాంగ్స్ యువతను ఉత్సాహపరుస్తాయి. మొత్తం మీద దేవీశ్రీప్రసాద్ సంగీత ఆల్బమ్ సూపర్‌హిట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరో చిత్రాలకు అధిక చిత్రాలను చేసిన సంగీతదర్శకుడిగా దేవీశ్రీప్రసాద్ వాసికెక్కారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో విక్రమ్ హీరోగా నటిస్తున్న సామి స్క్వేర్ చిత్రానికి దేవీ అందించిన పాటల ఆల్బమ్ సంగీత ప్రియుల నుంచి విశేష ఆదరణను అందుకుంటోంది. ఒక చిత్రంలో అన్ని పాటలు హిట్ అవ్వడం అన్నది అరుదైన విషయమే. అలాంటి అరుదైన విషయం సామి స్క్వేర్ చిత్రానికి రిపీట్ అయ్యిందని మ్యూజిక్ సంస్థల నిర్వాహకులు అంటున్నారు. దర్శకుడు హరి, విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సామి స్క్వేర్. ఇందులోని అదిరూపనే అనే మెలోడీ పాట, మిలగాపొడి అనే పెప్పీ సాంగ్ విడుదలై విశేష ఆదరణను పొందాయి. కాగా చిత్ర ఆడియో విడుదల తరువాత డర్నాకా అనే పాట, పుదు మెట్రో రైలు అనే పాటకు సంగీత ప్రియుల నుంచి విపరీతమై రెస్పాన్స్ వస్తోందని చిత్ర వర్గాలు అంటున్నారు. పుదు మెట్రోరైలు పాటను రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ రాయడం విశేషం. ఈయన ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో పాటలను రాసి అవార్డులను కూడా అందుకున్నారు. ఇక తమిళంలోనూ గీత రచయితగా తన ప్రస్తానాన్ని ప్రారంభించారన్నమాట. ఇందులో అమ్మ గురించిన పాటకు చాలా మంచి స్పందన వస్తోందని చిత్ర వర్గాలు తెలిపారు. ఇలా చిత్రంలోని అన్ని పాటలు హిట్ అవ్వడంతో సామి స్క్వేర్ చిత్ర యూనిట్ ఖుషీ అవుతోంది. దేవీశ్రీప్రసాద్ సినిమాలతో బిజీగా ఉన్నా, అమెరికా వంటి విదేశాల్లో సంగీత విభావరిలను నిర్వహిస్తూ అక్కడ తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆనందంలో నింపేస్తుంటారు. అదేవిధంగా మరోసారి అమెరికాలో సంగీత విభావరిని నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 11,18, 25, సెప్టెంబర్ నెల 1,8, 16 తేదీలలో అమెరికాలోని ముఖ్య నగరాల్లో రాక్‌స్టార్ సంగీత విభావరిని నిర్వహించనున్నారు. ఇందులో ఆయన బాణీలు కట్టిన తమిళం, తెలుగు సూపర్‌హిట్ పాటలతో అక్కడి మన వారిని అలరించడానికి రెడీ అవుతున్నారు. అందుకు రిహార్సల్ జరుగుతున్నట్లు దేవీశ్రీప్రసాద్ వర్గాలు పేర్కొన్నాయి. -
నాదస్వర మణులు
నాదస్వర కచేరీలో మహిళలు రాణించడం అరుదైన విషయం..అందులో కుటుంబ సభ్యులంతా రాణిస్తే విశేషం. ఆ కీర్తి ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి దక్కింది. మహిళలంతా నాదస్వర కచేరీలు నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ముదిగొండ: ముదిగొండ మండలం వల్లభి గ్రామంలోని పలువురు మహిళలు ‘నాదస్వర’ ప్రతిభావంతులుగా పేరు గడిస్తున్నారు. షేక్ మీరాబీ, హుస్సేన్‌బీ, జి రాజేశ్వరీ, అనిఫా, పి లక్ష్మి, పి నాగలక్ష్మి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ప్రోగ్రాంలు ఇస్తున్నారు. వీరంతా గ్రామానికే చెందిన షేక్ యాకూబ్‌సాహెబ్ వద్ద నాలుగేళ్లు సాధన చేశారు. తల్లిదండ్రుల కూడా ప్రోత్సహించారు. నాదస్వర నారీమణులు చదువుకున్నది కూడా తక్కువ అయినా, సాధనలో మిన్నగా ఉన్నారు. ఊపిరి బిగపట్టుకుని సప్తస్వరాలను సన్నాయిలో వినిపించడం అంత తేలికకాదు. ఇటువంటివి నేర్చుకునేందుకు మగవారు సైతం జంకుతారు. కానీ మహిళలు మాత్రం నిష్ణాతులై ప్రదర్శనలు ఇస్తున్నారు. నేర్చుకున్న స్వరాలు సరళి స్వరాలు, జంటలు, అలంకారాలు, పిల్లారి, గీతాలు, కృతులు, వర్ణాలు, మొదలగు కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, లయ, తాళం, రాగం, సృతి ప్రధానమైనవి. ప్రతి ఏటా వీరికి ఆరు నెలల పాటు సీజనల్ ప్రోగ్రామ్స్ చేస్తారు. మాఘమాసం, చైత్రం, వైశాఖమాసం, శ్రావణమాసం లలో వీరికి సీజన్. మిగతా ఆరు నెలలు జీవన భృతి కోసం కూలీ పనులకు వెళుతుంటారు. డోలు వాయిద్యకారుడు దరిపల్లి శేషయ్య కుమార్తెలు లక్ష్మి, నాగలక్ష్మి, నాగేశ్వరి ముగ్గురు నాదస్వరంలో ప్రావీణ్యం పొందారు. షేక్ మీరాబీ సిస్టర్స్ కూడా నాదస్వరంలో రాణిస్తున్నారు. ఖమ్మం, పాల్వంచ, భద్రాచలం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, తిరుపతి, సూర్యపేట, వేములవాడ రాజన్న దేవాలయాల్లో భక్తి గీతాలు ఆలపించడానికి సన్నాయి కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. అవార్డులు..ప్రశంసలు.. ఖమ్మంలో జరిగిన తెలుగు మహాసభల్లో అప్పటి కలెక్టర్ సిద్దార్థ జైన్ చేతుల మీదుగా ప్రశంసపత్రాలు, షీల్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో కళాకారులకు నిర్వహించిన సిల్కాన్ ఆంధ్రా ప్రోగ్రాంలో అవార్డులు, ప్రశంస పత్రాలు పొందారు. గత ఏడాది ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లచే సన్మానం పొందారు. అమ్మానాన్నల ప్రోత్సాహం.. చిన్ననాటి నుంచి సంగీతంపై మక్కువ పెంచుకున్నాం. నాన్న శేషయ్య డోలు వాయిద్యంలో మంచి ప్రావీణ్యుడు. మేం ముగ్గురం అక్కా చెల్లె్లళ్లం. అందరం కలిసి నాన్నతో పెళ్లిళ్లు, దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలకు వెళుతుంటాం. అమ్మానాన్నల ప్రోత్సాహంతో సంగీతంలో రాణిస్తున్నాం.– లక్ష్మి, నాగలక్ష్మి సన్నాయి సిస్టర్స్ ఎంతో ఇష్టం సన్నాయి, సంగీతంలో కళాకారులుగా రాణించడం ఎంతో ఇష్టం. ఇతర జిల్లాలకు వెళ్లి పెళ్లిళ్లకు, దేవాలయాల్లో ఆరాధనోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. మాకు సంగీతం నేర్పిన గురువుకు వందనం, మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చారు. అందరి ప్రసంశలు అందుకుంటున్నాం, –షేక్ మీరాబీ, సన్నాయి కళాకారిణి -
గననాధుడుకి స్వరార్చన
-
నెల్లూరులో సంగీత విభావరి
-
బీజేపీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో సంగీత విభావరి
దాదర్: ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా నవీముంబైలోని వాషి పట్టణంలో స్థానిక బీజేపీ పార్టీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. సెక్టార్ 14, బీజేపీ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి తిరుపతి పట్టణానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసురాలు, ఆకాశవాణి కళాకారిణి, ‘మధుర సంగీత భారతి’ వరలక్ష్మి నారాయణం హాజరయ్యారు. ‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట, తల్లిని మించి వేరే దైవము లేనే లేదురా-చల్లని తల్లి దీవెనలున్న ఇల్లే స్వర్గమురా’ వంటి గీతాలతో పాటు అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలు వినిపించి శ్రోతలను అలరించారు. కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు సి.వి. రెడ్డి, ఏక్నాథ్ మగద్వార్, విక్రం పారాజులి (బీజేపీ నేతలు), వాణీ శ్రీపాద, కె.ఎస్. మూర్తి, కె.వి. రమణయ్య శెట్టి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారిణి వరలక్ష్మిని వాణి శ్రీపాద సత్కరించారు.