ఇళయరాజా
మేస్ట్రో ఇళయరాజా... ఈ పేరు వినగానే సంగీత ప్రియులు ఆయన సినిమాల్లోని పాటలతో కూని రాగాలు తీస్తుంటారనడంలో సందేహం లేదు. తన పాటలతో అంతలా సంగీత ప్రియులను అలరించారాయన. తనకంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఇళయరాజా పుట్టినరోజు జూన్ 2న. ఈ ఏడాది ఆయన 75ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ)’ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘‘వచ్చే ఏడాది ఫిబ్రవరి 2, 3 తేదీల్లో చెన్నైలో ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నాం.
సంగీతం, సినిమా రంగానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఈ వేడుకకు తమిళ చిత్రసీమ మొత్తం తరలిరానుంది. వేలమంది అభిమానులు, సంగీత ప్రేమికుల మధ్య చెన్నైలోని వైఎమ్‌సీఏ మైదానంలో ఈ వేడుక నిర్వహించనున్నాం. రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ (తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ) నుంచి పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ‘ఇసయరాజా 75’ (సంగీతం రాజా) అని పేరు పెట్టాం. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో ఎటువంటి సినిమా షూటింగులు, ప్రమోషన్ కార్యక్రమాలు జరగవు. ఈ వేడుకలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి’’ అని టీఎఫ్‌పీసీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment