Tamil Film Producers Council (TFPC)
-
ఇసయరాజా @ 75
మేస్ట్రో ఇళయరాజా... ఈ పేరు వినగానే సంగీత ప్రియులు ఆయన సినిమాల్లోని పాటలతో కూని రాగాలు తీస్తుంటారనడంలో సందేహం లేదు. తన పాటలతో అంతలా సంగీత ప్రియులను అలరించారాయన. తనకంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఇళయరాజా పుట్టినరోజు జూన్ 2న. ఈ ఏడాది ఆయన 75ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్పీసీ)’ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘‘వచ్చే ఏడాది ఫిబ్రవరి 2, 3 తేదీల్లో చెన్నైలో ఈ వేడుకను గ్రాండ్గా నిర్వహించనున్నాం. సంగీతం, సినిమా రంగానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఈ వేడుకకు తమిళ చిత్రసీమ మొత్తం తరలిరానుంది. వేలమంది అభిమానులు, సంగీత ప్రేమికుల మధ్య చెన్నైలోని వైఎమ్సీఏ మైదానంలో ఈ వేడుక నిర్వహించనున్నాం. రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ (తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ) నుంచి పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ‘ఇసయరాజా 75’ (సంగీతం రాజా) అని పేరు పెట్టాం. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో ఎటువంటి సినిమా షూటింగులు, ప్రమోషన్ కార్యక్రమాలు జరగవు. ఈ వేడుకలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి’’ అని టీఎఫ్పీసీ పేర్కొంది. -
ఇక చాలు, ఆపేయండి: రజనీకాంత్
చెన్నై: తమిళ మూవీల షూటింగ్ లు వాయిదా పడటంపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. తనకు నచ్చని పదం ఏదైనా ఉంటే అది సమ్మె అని చెప్పారు. మరోవైపు దక్షిణ భారత చలనచిత్ర కార్మికుల సంఘాల సమాఖ్య (ఫెప్సీ), తమిళ చిత్ర నిర్మాతల మండలి మధ్య రాజీ కుదరని కారణంగా పలు తమిళ మూవీల బుధవారం రెండోరోజు షూటింగ్ వాయిదా పడ్డాయి. ఫెప్సీ, నిర్మాతల మండలి సమస్యను చర్చించి పరిష్కరించుకోవాలని ఓ ప్రకటన ద్వారా రజనీ విజ్ఞప్తి చేశారు. 'నాకు నచ్చని పదాల్లో సమ్మె ఒకటి. ఏ సమస్య ఉన్నా అహాన్ని విడిచిపెట్టి చర్చించడం ద్వారా పరిష్కారం కనుక్కోవాలి. లేని పక్షంలో సినిమా షూటింగ్స్ వాయిదాలు కొనసాగితే అది ఇరు వర్గాలకు శ్రేయస్కరం కాదు. చర్చల ద్వారా పరిష్కారం వెతకడం మంచిదని ఓ సీనియర్ నటుడిగా విజ్ఞప్తి చేస్తున్నానని' రజనీ అన్నారు. రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్న 'కాలా' మూవీ షూటింగ్ పనులు ఆపేశారు. నిర్మాతకు, వర్కర్లకు దీని వల్ల నష్టమే జరిగే చాన్స్ ఉందని రజనీ అభిప్రాయపడ్డారు. నటుడు విశాల్ నేతృత్వంలోని నడిగర్ సంఘం ఫెప్సీలో సభ్యులు కాని కొందరిని నిర్మాతలు తమ మూవీలలో తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో కొందరు వర్కర్స్ తమ ఇష్టరీతిన రెమ్యూనరేషన్, జీతాలు డిమాండ్ చేయడంతో వాటికి నిర్మాతల సంఘం ఒప్పుకోలేదు. కార్మికుల జీతాలను పెంచాలన్న తమ డిమాండ్ నెరవేర్చకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ఫెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి ప్రకటించిన విషయం తెలిసిందే. కార్మికులు సమ్మెకు దిగడంతో మంగళ, బుధ వారాల్లో షూటింగ్స్ నిలిచిపోయాయి.