ఇక చాలు, ఆపేయండి: రజనీకాంత్ | Rajinikanth calls to end stir on wage issue in tamil nadu | Sakshi
Sakshi News home page

ఇక చాలు, ఆపేయండి: రజనీకాంత్

Published Wed, Aug 2 2017 5:42 PM | Last Updated on Mon, Oct 1 2018 5:41 PM

ఇక చాలు, ఆపేయండి: రజనీకాంత్ - Sakshi

ఇక చాలు, ఆపేయండి: రజనీకాంత్

చెన్నై: తమిళ మూవీల షూటింగ్ లు వాయిదా పడటంపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. తనకు నచ్చని పదం ఏదైనా ఉంటే అది సమ్మె అని చెప్పారు. మరోవైపు దక్షిణ భారత చలనచిత్ర కార్మికుల సంఘాల సమాఖ్య (ఫెప్సీ), తమిళ చిత్ర నిర్మాతల మండలి మధ్య రాజీ కుదరని కారణంగా పలు తమిళ మూవీల బుధవారం రెండోరోజు షూటింగ్‌ వాయిదా పడ్డాయి. ఫెప్సీ, నిర్మాతల మండలి సమస్యను చర్చించి పరిష్కరించుకోవాలని ఓ ప్రకటన ద్వారా రజనీ విజ్ఞప్తి చేశారు.

'నాకు నచ్చని పదాల్లో సమ్మె ఒకటి. ఏ సమస్య ఉన్నా అహాన్ని విడిచిపెట్టి చర్చించడం ద్వారా పరిష్కారం కనుక్కోవాలి. లేని పక్షంలో సినిమా షూటింగ్స్ వాయిదాలు కొనసాగితే అది ఇరు వర్గాలకు శ్రేయస్కరం కాదు. చర్చల ద్వారా పరిష్కారం వెతకడం మంచిదని ఓ సీనియర్ నటుడిగా విజ్ఞప్తి చేస్తున్నానని' రజనీ అన్నారు. రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తీస్తున్న 'కాలా' మూవీ షూటింగ్ పనులు ఆపేశారు.  నిర్మాతకు, వర్కర్లకు దీని వల్ల నష్టమే జరిగే చాన్స్ ఉందని రజనీ అభిప్రాయపడ్డారు.

నటుడు విశాల్ నేతృత్వంలోని నడిగర్ సంఘం ఫెప్సీలో సభ్యులు కాని కొందరిని నిర్మాతలు తమ మూవీలలో తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో కొందరు వర్కర్స్ తమ ఇష్టరీతిన రెమ్యూనరేషన్, జీతాలు డిమాండ్ చేయడంతో వాటికి నిర్మాతల సంఘం ఒప్పుకోలేదు. కార్మికుల జీతాలను పెంచాలన్న తమ డిమాండ్ నెరవేర్చకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ఫెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి ప్రకటించిన విషయం తెలిసిందే. కార్మికులు సమ్మెకు దిగడంతో మంగళ, బుధ వారాల్లో షూటింగ్స్ నిలిచిపోయాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement