ప్రాంతీయ భాషల్లో ఔత్సాహిక గాయనీ గాయకులను యువ కళాకారులను వెలుగులోకి తెచ్చే జీ సరిగమప పాటల పోటీలు తుది దశకు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 5గురు యువ గాయనీ గాయకులు ఈ పోటీల్లో టైటిల్ కోసం తలపడనున్నారు. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ పోటీలో తుది పోటీలకు మిగిలిన ఈ 5గురి ప్రతిభా పాటవాలకు జీ తెలుగులో 21న జరుగనున్న పోటీ అద్దం పట్టనుంది. సాయంత్రం 6గంటలకు పోటీ ప్రసారం కానుంది.
గత కొన్ని వారాలుగా వీక్షకుల ఆదరణతో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో తుది అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఔత్సాహిక గాయనీ గాయకులు భరత్ రాజ్, ప్రజ్ఞా నయిని, పవన్ కళ్యాణ్,వెంకట చైతన్య, యశస్వి కొండేపూడిలలో ఎవరు టైటిల్ గెలుచుకుంటారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తెలుగు వీక్షకుల ఆదరణ పొందిన ఈ కార్యక్రమం ఫైనల్స్ ని మరింత ఆకర్షణీయంగా అందించనున్నారు. కార్యక్రమం ఆసాంతం టాలీవుడ్ టాలెంట్‌తో కళకళలాడనుంది. ముఖ్యంగా తాజా యువ గాన సంచలనం సిద్ శ్రీరామ్ ప్రత్యేక ఆకర్షణగా హాజరుకానున్నారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి, గాయని సునీత, గాయని కల్పన, గాయకులు బాబా సెహగల్, జోయా హుస్సేన్‌లు సైతం వీక్షకులను ఉర్రూతలూగించనున్నారు. గాయని గీతామాధురి, రమ్య బెహ్రా, కృష్ణ చైతన్య లు మెంటార్స్‌గా వ్యవహరిస్తున్న ఈ పోటీలో సంగీత దర్శకులు కోటి, ఎస్పీ శైలజ, చంద్రబోస్‌లు న్యాయ నిర్ణేతలు.
Comments
Please login to add a commentAdd a comment